ములుగురూరల్, అక్టోబర్10:సర్కారు బంగ్లాలు పచ్చని లోగిళ్లతో దర్శనమిస్తున్నాయి. ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమం కార్యాలయాలకు కొత్త శోభను తెచ్చిపెట్టాయి. పచ్చదనం పెరిగి కొత్తందాలతో కళకళలాడుతున్నాయి. ములుగు జిల్లా కేంద్రం, జనగామ జిల్లా బచ్చన్నపేట మండలాల్లో ఆఫీసులు హరిత వనాలుగా రూపుదిద్దుకున్నా యి. అవసరాల కోసం కార్యాలయాలకు వచ్చే ప్రజలకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ములుగు ఎంపీడీవో కార్యాలయం చిట్టడవిని తలపిస్తుండగా, మిగతావి పూలు, పండ్లు, నీడనిచ్చే చెట్లతో పచ్చందాలు పరుచుకున్నాయి.
ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు పచ్చందాలతో కనువిందు చేస్తున్నాయి. నాడు బూత్ బంగ్లాలుగా దర్శనమివ్వగా, సీఎం కేసీఆర్ 2014లో రూపకల్పన చేసిన చేసిన హరితహారంతో నందానవనాలుగా తయారయ్యాయి. తొలి విడుతలో ఎంపీడీవో కార్యాల యంలో సుమారు అర ఎకరం విస్తీర్ణంలో 300 టేకు మొక్కలను అధికారులు నాటారు. వాటిని సంరక్షిం చేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని నియమించడంతో చిట్టడివిని తలపిస్తున్నది. దీంతోపాటు జడ్పీ కార్యాలయం ఆవరణలో సైతం పచ్చదనం పరిఢవిల్లుతున్నది. అధికారులు, ప్రజాప్రతినిధుల వా హనాల కు నీడను ఇవ్వడంతోపాటు కార్యాలయాలకు వచ్చే సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.
భావితరాలకు గొప్ప ఆస్తి
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన హరితహారం కార్యక్రమం భావితరాలకు ఎంతో మేలు. సొంతింటిని మొక్కలతో ఎలా అయితే ఇష్టంగా పెంచుకుంటామో అదే మాదిరిగా ప్రభుత్వ కార్యాలయాల్లో నాటడం తో పచ్చ దనంతో కళకళలాడుతున్నాయి. ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటడం వల్ల ముందు తరాలకు మేలు చేసిన వారం అవుతాం. ములుగు జిల్లాను పచ్చలహారంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత అందరిపై ఉంది. – గండ్రకోట శ్రీదేవి, ములుగు ఎంపీపీ
పచ్చదనానికి కేరాఫ్..
ములుగు జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్, ఎంపీడీవో, గ్రామపంచాయతీ, జాకారంలోని డీఆర్డీఏ కార్యాలయం, పోలీస్‌స్టేషన్ పచ్చదనానికి కేరాఫ్‌గా నిలుస్తున్నది. నాటిన ప్రతి మొక్కనూ అధికారులు, సిబ్బంది సంరక్షిస్తుండడంతో అవి ప్రాణం పోసుకొని స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను అందిస్తున్నాయి. పెరిగిన పూలు, ఇతర మొక్కలతో కార్యాలయాలు చిన్నపాటి పార్కు వలె కనిపిస్తున్నాయి.