మహదేవపూర్, జూన్ 19 : యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని ఎంపీడీవో వెంకటేశ్వర్లు తెలిపారు. ఈనెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మండల కేంద్రములోని డా. బాబాసాహెబ్ అంబేద్కర్ పార్కు నందు ఆయుష్ శాఖ, శ్రీపరివార్ యోగ సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగ దినోత్సవం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఉదయం: 06.00 నుంచి 07.30 గంటల వరకు యోగ కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు.
ప్రస్తుత జీవనశైలిలో వచ్చిన మార్పుల వలన ప్రజలు అనేక రకాలైన రోగాల బారిన పడుతున్నందున ఈ తరుణంలో యోగాను ప్రతి ఒక్కరు ఆచరించుటకు గాను మానవాళికి యోగా విశిష్టతను, ప్రాముఖ్యతను తెలియజేసి శరీరాన్ని, మనస్సును శుద్ధిచేసి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దేందుకు యోగ దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమానికి మండల ప్రజలు, ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.