లింగాల గణపురం : అంగన్వాడీలో ఇక నుంచి వారానికి రెండు సార్లు చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు ఎగ్ బిర్యాని అందిస్తారని ఎంపీడీవో జలంధర్ రెడ్డి తెలిపారు. లింగాల గణపురంలో అంగన్వాడీ కేంద్రాల్లో మంగళవారం ఎగ్ బిర్యానీ పథకాన్ని ఆయన ప్రారంభించారు. అంతకుముందు జరిగిన అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. ప్రజలు అంగన్వాడీ కేంద్రాలను సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
అంగన్వాడీ కేంద్రాల్లో పూర్వ విద్యను అందించడంతోపాటు పౌష్టిక ఆహారాన్ని అందిస్తారన్నారు. చిన్నారులను తప్పనిసరిగా అంగన్వాడీ కేంద్రాలకు పంపించాలన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ కుమార్, అంగన్వాడీ టీచర్లు సావిత్రి, ఇందిర, విజయలక్ష్మి, అనిత, ఏఎన్ఎం స్వరూప, ఆశా కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు.