హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 14: నాట్యగురువులు, సంగీత గురువులకు ఈనెల 30వ తేదీన హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్లో మూవీ ఆడిషన్స్ అండ్ కాంపీటిషన్స్నిర్వహిస్తున్నట్లు గోపాల్‌పూర్‌కు చెందిన శ్రీదుర్గా నృత్యాలయం నిర్వాహకురాలు గంప శైలజ తెలిపారు. సోమవారం హనుమకొండ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. పోటీల్లో పాల్గొన్నవారికి నగదు బహుమతులతో పాటు ప్రతి ఒక్కరికి మెమెంటో అండ్ సర్టిఫికెట్లు అందించనున్నట్లు తెలిపారు.
త్వరలో నిర్వహించే ఆడియో రిలీజ్ ఫంక్షన్‌కి ఎంట్రీ పాస్ ఉంటుందని, ఇంకా అన్ని ప్రముఖ ఛానెల్స్‌లో రియాలిటీ షోలకి కూడా అవకాశం కల్పిస్తామన్నారు. ఈ అవకాశాన్ని నర్తకీమణులు, పాటలు పాడేవారు, పాటలు రాసేవారు, డబ్బింగ్ ఆర్టిస్ట్స్, యాంకర్స్వినియోగించుకోవాలని, ఇతర వివరాలకు 85208 68880 నెంబర్‌ను సంప్రదించాలని ఆమె కోరారు.