మహబూబాబాద్ రూరల్, మే 14 : మహబూబాబాద్ జిల్లాలో మక్కలు, ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరుగుతున్నదని, వెంటనే ప్రక్రియను వేగవంతం చేయాలని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు కలెక్టర్ స్నేహా శబరీష్‌ను కోరారు. గురువారం మానుకోటలోని పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మక్కలు, ధా న్యం కాంటాలు వేయడంలో మీనమేషాలు లెక్కి స్తూ రైతులను రోజుల తరబడి ఇబ్బంది పెడుతున్నదన్నారు.
ప్రతి సెంటర్లో అన్నదాతలు ఆకలితో అలమటిస్తున్నారని, కొనుగోళ్ల విషయం లో అధికారులకు ముందు చూపు లేదన్నా రు. చాలా కేంద్రాల్లో సరైన వసతులు లేవని, కాంటా లు కాక రైతులు గోస పడుతున్నారన్నా రు. కాగా, ఎస్పీ శబరీష్‌తో కలిసి మార్కెట్‌కు వచ్చిన కలెక్టర్‌కు రైతులు పడుతున్న ఇబ్బందులను తక్కళ్లపల్లి వివరించారు. వెంటనే ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని, ప్రతి గింజను ప్రభు త్వం కొనేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలా గే రైతులకు అన్యాయం జరగకుండా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, అన్నదాతలకు భరోసా కల్పించాలని కోరారు.