తొర్రూరు/కృష్ణకాలనీ, మే 21: ఈ నెల 23న పాలకుర్తి నియోజకవర్గ పట్టభద్రులు, బీఆర్ఎస్ శ్రేణుల సమావే శాన్ని తొర్రూరులో నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి ఎర్ర బెల్లి దయాకర్‌రావు వెల్లడించారు. మంగళవారం తొర్రూరు లో ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డి విజయా న్ని కాంక్షిస్తూ 23న మధ్యాహ్నం 2 గంటలకు తొర్రూ రులో ని పీఎస్ఆర్ స్కూల్ ఆవరణలో సమావేశాన్ని నిర్వహి స్తున్నట్లు తెలిపారు.
మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు, ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగు ల రాకేశ్‌రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్‌కు మార్ హాజరవుతున్నారని చె ప్పారు. అలాగే భూపాలపల్లి లోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న పట్టభద్రుల నియోజకవర్గస్థాయి స న్నా హక సమావేశంలో ఎమ్మెల్యే హరీశ్‌రావు, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి హాజరవుతారని పార్టీ అర్బన్ అధ్యక్షుడు కటకం జనార్దన్ తెలిపారు. విజయవంతం చేయాలని కోరారు.