నల్లబెల్లి : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ మందకొడిగా జరుగుతోంది. నల్లబెల్లి మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సరళిని తహసిల్దార్ ముప్పు కృష్ణతో పాటు రూరల్ సీఐ సాయి రమణ, ఎస్సై గోవర్ధన్ పర్యవేక్షించారు. మొత్తం 67 ఓట్లకు గాను 10:30 గంటల వరకు 15 ఓట్లు పోలయ్యాయి. పోలింగ్ బూత్ వద్ద పోలీస్ శాఖ 144 సెక్షన్ విధించింది. అయితే తెలంగాణ పి.ఆర్.టి.యు, యుటిఎఫ్ ఉపాధ్యాయ సంఘాల నాయకులతో పాటు బిజెపి నాయకులు మండల కేంద్రంలో వారి వారి అభ్యర్థుల గెలుపు కోసం బ్యాలెట్ నమూనా పత్రాలతో ప్రచారం నిర్వహిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఒక్కో ఓటుకు ఆయా సంఘాల నాయకులు రెండు వేలరూపాయలు ముట్టచెబుతున్నట్లు సమాచారం. ఎమ్మెల్సీ ఎన్నికలను పురస్కరించుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగనుంది.