దేవరుప్పుల, మే 10 : పద్మశ్రీ అవార్డు గ్రహీత గడ్డం సమ్మయ్యను శనివారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆమె నివాసంలో సన్మానించి అభినందించారు. అంతరించిపోతున్న చిందు యక్షగాన కళను కాపాడేందుకు కృషిచేస్తూ కేంద్ర ప్రభుత్వ అత్యున్నత పురస్కారం పద్మశ్రీ పొందడం తెలంగాణకు గర్వకారణమన్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో చిందు యక్షగానం ద్వారా ప్రజలను చైతన్యపరిచిన సమ్మయ్య, తెలంగాణ ఆవిర్భావానంతరం ప్రభుత్వ పక్షాన అనేక చైతన్య, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లారని కొనియాడారు. దేశవ్యాప్తంగా 40వేల ప్రదర్శనలు ఇచ్చిన సమ్మయ్య, అతడి బృందానికి ఎమ్మెల్సీ కవిత అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో గడ్డం సోమరాజ్, గడ్డం హిమగిరి ఉన్నారు.