రామారెడ్డి, మార్చి 28: మండలంలోని ఇసన్నపల్లి -రామారెడ్డి గ్రామాల్లో వెలసిన శ్రీ కాలభైరవ స్వామి ఆలయాన్ని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శనివారం సందర్శించనున్నారు. ఉదయం 9 గంటలకు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
అనంతరం బీఆర్ఎస్ నాయకులతో సమావేశమవుతారు. 11 గంటలకు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శుభం కన్వెన్షన్లో నిర్వహించనున్న బీసీ కుల సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొంటారని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి.