హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 1: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పేదలకు సన్నబియ్యం పంపిణీ సక్రమంగా జరగాలని, అవకతవకలు జరగకుండా చూసుకోవాలని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం 5వ డివిజన్ రెడ్డి కాలనీలో కార్పొరేటర్ పోతుల శ్రీమన్నారాయణ అధ్యక్షతన నాయిని రాజేందర్ రెడ్డి ఘనంగా ప్రారంభించి లబ్దిదారులకు సన్న బియ్యం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతినెలా ఇక నుంచి రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం అందజేయనున్నట్లు తెలిపారు.
రేషన్ డీలర్ల సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమకుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బత్తుల రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి గుర్రపు రమేష్, గౌరవ అధ్యక్షులు కోమాకుల కుమారస్వామి, ఉపాధ్యక్షుడు దుంపేటి నరేందర్ బాబు, కోశాధికారి నరెట్ల మహేందర్ ఉపాధ్యక్షుడు నేతి రమేష్ ఆడిట్ కమిటీ కన్వీనర్ లింగ బత్తుల సత్తయ్య ముఖ్య సలహాదారు గంజి రాజేందర్, ఆడిట్ కమిటీ మెంబర్ తీరాల శ్రీధర్, సహాయ కార్యదర్శులు గోరంట్ల రాజ్ కుమార్, సూచన సురేష్, ప్రచార కార్యదర్శి బత్తుల మహేందర్, కార్యవర్గ సభ్యుడు కొంగ సారంగపాణి తదితరులు పాల్గొన్నారు.