కూరగాయల వ్యాపారుల అభివృద్ధికి కృషి
వరంగల్తూర్పులోని లక్ష్మీపురం మోడల్ కూరగాయల మార్కెట్, పండ్ల మార్కె ట్ వ్యాపారుల అభివృద్ధికి కృషి చేస్తానని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. శనివారం లక్ష్మీపురంలోని మోడల్ కూరగాయల మార్కె ట్, పండ్ల మార్కెట్ నిర్మాణపనులను పరిశీలించారు.
- త్వరలోనే పక్కా భవనాలు నిర్మిస్తాం
- ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్
- లక్ష్మీపురం మోడల్ మార్కెట్ నిర్మాణ పనుల పరిశీలన
కాశీబుగ్గ, జూలై 22: వరంగల్తూర్పులోని లక్ష్మీపురం మోడల్ కూరగాయల మార్కెట్, పండ్ల మార్కె ట్ వ్యాపారుల అభివృద్ధికి కృషి చేస్తానని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. శనివారం లక్ష్మీపురంలోని మోడల్ కూరగాయల మార్కె ట్, పండ్ల మార్కెట్ నిర్మాణపనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాపార వాణిజ్యాలు గొప్పగా ఉండాలనే మంచి సంకల్పంతో ఇక్కడ పండ్ల మార్కెట్ నిర్మించనున్నట్లు తెలిపారు. కూరగాయల మార్కెట్ వ్యాపారుల శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని పదెకరాలు కేటాయించినట్లు తెలిపారు. పక్కనే వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్ వస్తుందని ఇప్పుడున్న మార్కెట్‌ను మరింత అందంగా తీర్చిదిద్ది మార్కెట్ చుట్టూ ప్రహరీ ఏర్పాటుతో పాటు రెండు ద్వారాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
కూరగాయలు, మాంసం కొనుగోలు చేయడానికి వచ్చిన వినియోగదారులు పూర్తిగా ఒకే చోట అన్ని కొనుగోలు చేసుకునేలా చూస్తామన్నారు. వ్యాపారులు బ్రహ్మాండంగా వ్యాపారం చేసుకునేలా పక్కా భవనాలు నిర్మించి, హెల్త్ పరంగా బ్యాక్టీరియాస్తో ఇబ్బంది పడకుండా ఇతర ఫుడ్ సేఫ్టిలు తీసుకొని మార్కెట్‌ను నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇదే మార్కెట్ పై ఆధారపడినటువంటి యజమానులు, గుమస్తాలు, మహిళా కార్మికులు, వ్యాపారులకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. విశ్రాంతి భవనం, టాయిలెట్స్, ఏదైనా సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి ఒక హాల్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే రీజినల్ మార్కెటింగ్‌శాఖ కార్యాలయాన్ని తొలగించి నూతన మార్కెట్, పోలీస్‌స్టేషన్, టీఎన్జీవోస్ బిల్డింగ్, ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్‌లో మంచి హోటల్ నిర్మాణం చేస్తున్నట్లు వివరించారు.
మార్కెట్ చుట్టూ రోడ్డు ఏర్పాటు చేసి బయట వ్యాపారం కాకుండా మార్కెట్లో వ్యాపారం చేసుకునేలా చూస్తామన్నారు. గతంలో 33 లైసెన్స్‌లు ఉంటే తాను వ్యాపారులను పిలిచి 99 లైసెన్స్‌లు ఇచ్చిన చరిత్ర తనదేనన్నారు. దుకాణాల ముందు తాత్కాలికంగా వర్షాకాలం అయిపోయే వరకు తమ వ్యక్తిగతంగా రేకుల షెడ్డు ఏర్పాటు చేసుకోవడానికి అనుమతివ్వాలని వ్యాపారస్తులు కోరగా, మార్కెటింగ్ అధికారులతో మాట్లాడి వెసులబాటు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో చైర్పర్సన్ డీ భాగ్యలక్ష్మి, కార్పొరేటర్లు డీ కుమారస్వామి, అనిల్, ప్రవీన్, మాజీ కార్పొరేటర్ రమేశ్, భాస్కర్, కార్యదర్శి వెంకటేశ్ రాహుల్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యపై చర్యలకు ప్రొఫెసర్లు, విద్యార్థుల డిమాండ్.. వీడియో
Kolkata’s Presidency University | వివేకానంద పోస్టర్‌కు అవమానం.. ఇద్దరు విద్యార్థినులను బహిష్కరించిన యూనివర్సిటీ
కార్మికుల బోనస్‌పై సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం
Koppula Eshwar | కరువు మండలాల రైతులకు ఆర్థిక సహాయం విడుదల చేయాలి : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

