గిర్మాజీపేట, మార్చి 12 : భూ కబ్జాలు చేసినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. స్టేషన్‌రోడ్డులోని మహేశ్వరి గార్డెన్లో వ్యాపారుల ఆత్మీయ సమ్మేళననానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొందరు నాయకులకు కొమ్ముకాసే ఆన్లైన్ పత్రికలు తనపై ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఎమ్మెల్యే ఘాటుగా స్పందించారు. అబద్ధాలు ప్రచురిస్తున్న వీటిపై సీపీ దృష్టికి తీసుకుపోతానన్నారు. తనపై అసత్య ప్రచారాలు, ఆరోపణలు చేసేవారు దమ్ముంటే నిరూపించాలన్నారు. తాను నివాసముంటున్న ఇల్లుతో పాటు ఏఎస్ఎం కళాశాల వద్ద ఉన్న నివాసం తప్ప నియోజకవర్గంలో తనకు ఇంచు జాగ కూడా లేదని తెలిపారు. ఆరోపణలను నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. వరంగల్చౌరస్తాను అభివృద్ధి చేస్తానన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి రూ. 3,800 కోట్లు నిధులు తీసుకొచ్చామని గుర్తుచేశారు. పోచమ్మమైదాన్ నుంచి స్టేషన్ రోడ్డు వరకు వ్యాపారుల కోరిక మేరకు డివైడర్‌ను తొలగిస్తామని హామీ ఇచ్చారు. కార్పొరేటర్ దిడ్డి కుమారస్వామి, బాలిన సురేశ్, బీఆర్ఎస్ నాయకులు చింతాకుల సునీల్, దుబ్బ శ్రీనివాస్, రమేశ్‌బాబు, ట్రాఫిక్ సీఐ బాబూలాల్ పాల్గొన్నారు.
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్ దుకాణం బంద్ అయిందని, ఆ పార్టీ నాయకులకు సీట్ల పంచాయితీ తప్ప ప్రజల బాగోగులు పట్టవని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ఆటోనగర్‌కు చెందిన మైనార్టీ నాయకుడు అస్రఫ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అస్రఫ్, ఇమ్రాన్, ఫయాజ్, ఖదీర్, జమీల్, జుబైర్, ఫుర్కాన్, అబ్దుల్, ఇర్ఫాన్, యాకూబ్, పాషా, సల్మాన్, అబ్దుల్ష్రీద్, అనీఫ్, ఖా జామియా, రెహన్ క్యాంప్ కార్యాలయంలో బీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే వారికి గులాబీ కండువాలు క ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మా ట్లాడుతూ.. చోటామోటా నాయకులు తప్ప కాంగ్రెస్ లో ఎవరూ లేరని, వారు ఎలక్షన్లు వస్తేనే ప్రజల వద్దకు వస్తారన్నారు. ఇలాంటి వారికి ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ గొప్పగా అభివృద్ధి చెందుతున్నదన్నారు. అనంతరం ఎమ్మెల్యేను పలు డివిజన్ల పార్టీ అధ్యక్షులు సన్మానించారు. ఆర్యవైశ్య మిత్ర బృందం అధ్యక్షుడు దుబ్బ శ్రీనివాస్ ఎమ్మెల్యేకు స్వీట్ తినిపించారు. డివిజన్ అధ్యక్షులు సోల రాజు, మీరిపల్లి వినయ్‌కుమార్, బోరిగం నర్సింగం, యాకూబ్, రాజేశ్, ఉమేందర్, ఇక్బాల్, అనిల్, శివ పాల్గొన్నారు.
వరంగల్ చౌరస్తా : 32వ డివిజన్ పరిధిలోని బీర న్న నగర్లో నిర్మించిన పోచమ్మ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే నన్నపునేని హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన సంస్కృతీ సంప్రదాయాల నిలయాలైన ఆలయాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. అందులో భాగంగానే భద్రకాళి, గోవిందరాజుల స్వామి ఆలయాలను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. ప్రజా సంక్షేమం కోరుతూ యజ్ఞయాగాలు చేసిన ఒకే ఒక సీఎం కేసీఆర్ అని తెలిపారు. అనంతరం ఆలయ కమిటీ ప్రతినిధులు ఎమ్మెల్యేను సత్కరించారు. అలాగే, కార్పొరేటర్ పల్లం పద్మ-రవి దంపతులను ఎమ్మెల్యే సన్మానించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు అమూల్య శ్రీనివాస్, కొమురయ్య, ఆవుల వేణు, వేణుప్రసాద్, సక్కుబాయి, భాగ్యలక్ష్మి, కట్టమ్మ, మోడం ప్రవీణ్, మాటేటి శ్యాం, దస్తగిరి, శోభన్, రాజేశ్వర్ పాల్గొన్నారు.
వరంగల్ చౌరస్తా : రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు ముందుకు రావడం అభినందనీయమని ఎమ్మెల్యే నన్నపునేని అన్నారు. 40వ డివిజన్ పరిధిలోని హరిజనవాడలో యువత ఏర్పాటు చేయనున్న అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ రవి, వనం కుమార్, వొగిలిశెట్టి అనిల్, మోడం ప్రవీణ్, సురేశ్, కోరె కృష్ణ పాల్గొన్నారు.
పోచమ్మమైదాన్ : ఇంటింటికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని ఎమ్మెల్యే నరేందర్ అన్నారు. 23వ డివిజన్ కొత్తవాడతో పలువురు లబ్ధిదారులకు రూ.14,01,624 విలువైన కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు పేద ఆడబిడ్డలకు వరంగా మారాయన్నారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలతో ప్రజలు ఆనందంగా ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ యెలుగం లీలావతీ సత్యనారాయణ పాల్గొన్నారు.
పోచమ్మమైదాన్ : వరంగల్ 23వ డివిజన్లోని కొత్తవాడలో రోడ్డు పనులను ఎమ్మెల్యే నరేందర్ మాజీ కార్పొరేటర్ యెలుగం లీలావతీసత్యనారాయణతో కలిసి ప్రారంభించారు. డివిజన్లో మరో రూ.3 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు యెలుగం చినకొమురయ్య, ఏల్పుల అంజయ్య, యెలుగం సాంబ య్య, మేడిది సాంబయ్య పాల్గొన్నారు.