హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 14 : హనుమకొండ చౌరస్తాలో ముకుంద జువెల్లర్స్ ఫ్యాక్టరీ ఔట్లెన్ను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి-నీలిమ దంపతులు శనివారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ ప్రజలకు నమ్మకమైన, నాణ్యమైన బంగారాన్ని అందించాలని సూచించారు. ఫ్యాక్టరీ ఔట్‌లెట్‌ను హనుమకొండ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. ముకుంద జ్యువెల్లర్స్ మేనేజింగ్ డైరెక్టర్ నరసింహారెడ్డి మాట్లాడుతూ కేపీహెచ్‌బీ, కొత్తపేట, సోమాజీగూడ, ఖమ్మంలోని తమ బ్రాంచ్‌లు ఊహించినదాని కంటే ఎకువ విజయవంతం కావడంతో హనుమకొండలో నూతన బ్రాంచ్‌ను ప్రారంభించామన్నారు. త్వరలోనే మరిన్ని బ్రాంచ్‌లను ఏర్పాటు చేస్తామని పేర్కొంటూ తమను ప్రోత్సహిస్తున్న కస్టమర్లకు నరసింహారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.