కేసముద్రం, డిసెంబర్18 : రైతును రాజు చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో రూ.1.50కోట్లతో నిర్మించిన కార్యాలయ భవనాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని విస్మరిస్తే, బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చిందని ఆరోపించారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం రైతుబంధు ద్వారా ఎకరానికి రూ.10వేల పంట పెట్టుబడి, మృతి చెందిన రైతు కుటుంబాలకు రూ.5లక్షల బీమా, 24 గంటల ఉచిత కరంటు అందిస్తూ అన్నదాతలకు అండగా ఉంటున్నట్లు తెలిపారు. మిషన్‌కాకతీయ పథకం ద్వారా ద్వారా చెరువుల్లో పూడికతీసి, కట్టలు, తూములను బలోపేతం చేసి నీటి నిల్వ సామర్థ్యం పెంచాడని అన్నారు. గోదావరిపై నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నీరు చెరువులకు చేరడంతో వేసవిలోనూ మత్తడి దుంకుతున్నాయన్నారు.
బావులు, బోర్లలో భూగర్భ జలాలు పెరగడంతో రైతులు ఏడాదికి 2 పంటలు పండిస్తున్నారని అన్నారు. నాణ్యమైన విత్తనాల సరఫరాతోపాటు రైతులు ఆరుగాలం కష్టించి పండించిన పంట ఉత్పత్తులకు మద్దతు ధర కల్పిస్తున్నట్లు తెలిపారు. మార్కెట్లో రూ.7 కోట్లతో గోదాములు, షెడ్లు, విశ్రాంతి భవనం, మరుగుదొడ్లు, తాగునీటి వసతి, నూతన భవనం నిర్మించామన్నారు. కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పటికీ ఎక్కడా సంక్షేమ పథకాలు నిలిపి వేయలేదన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ మర్రి నారాయణరావు, జడ్పీటీసీ రావుల శ్రీనాథ్‌రెడ్డి, సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు మాదారపు సత్యనారాయణరావు, నాయకులు బీరవెళ్లి భరత్‌కుమార్‌రెడ్డి, ఊకం టి యాకూబ్‌రెడ్డి, మహ్మద్ నజీర్ అహ్మద్, దీకొండ వెంకన్న, నీలం దుర్గేశ్, రవీందర్‌గౌడ్, కముటం శ్రీనివాస్, రమేశ్, జాటోత్ హరీశ్‌నాయక్, సంకపల్లి జనార్దన్‌రెడ్డి, తోకల శ్రీనివాస్‌రెడ్డి, నీలం యాకయ్య, బేతమల్ల చంద్రయ్య, గుగులోత్ వీరూనాయక్, సట్ల శ్రీనివాస్, డీడీఎం వెంకట్‌రెడ్డి, మార్కెట్ అధికారులు అమరలింగేశ్వరరావు, రాజా, రాజేందర్ పాల్గొన్నారు.
క్రీడల్లో రాణిస్తే బంగారు భవిష్యత్
మహబూబాబాద్, డిసెంబర్ 18 : క్రీడల్లో రాణిస్తే బంగారు భవిష్యత్ ఉంటు ందని ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ అన్నారు. ఆదివా రం పట్టణంలో 8వ తెలంగా ణ క్రాస్ కంట్రీ చాంపియన్‌షిప్ అండ్ కాంపిటీషన్ పోటీలను ఆయన మున్సిపల్ చైర్మ న్ రామ్మోహన్‌రెడ్డితో కలిసి జెండా ఊపి ప్రారంభించా రు. అండర్-20 బాల బాలికలకు 10 కే రన్, 8కే, 6కే రన్, అండర్-18 బాలబాలికల 6కే, 4కే రన్, అండర్-16 బాల బాలికలకు 2కే రన్ పట్టణంలోని వైఎస్సార్ విగ్రహం నుంచి నర్సంపేట బైపాస్ రోడ్డు వరకు నిర్వహించారు. ఇందులో మొత్తం 684 మంది పాల్గొనగా, 32 మంది విజేతలుగా నిలిచారు. వీరందరూ వచ్చే నెలలో అసొంలో జరుగనున్న నేషనల్ అథ్లెటిక్స్‌లో పాల్గొంటారు. అనంతరం ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే శంకర్‌నాయక్, మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్‌రెడ్డి గెలుపొందిన అథ్లెట్లకు ప్రశంసా పత్రాలు, మెమెంటోలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. క్రీడలతో రిజర్వేషన్ల ద్వారా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. కాగా, ఓవరాల్ చాంపియన్‌గా మెదక్, మెన్ విభాగంలో వరంగల్, ఉమెన్ విభాగంలో మెదక్, అండర్-20 మెన్ విభాంగలో వరంగల్, ఉమెన్ విభాగంలో మెదక్ చాంపియన్లుగా నిలిచారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ మహబూబాబాద్ అధ్యక్షుడు కల్వకూరి చంద్ర శేఖర్, జిల్లా యువజన క్రీడల అధికారి అనిల్, తెలంగాణ క్రాస్‌కంట్రీ సెక్రటరీ సారంగపాణి, జిల్లా సెక్రటరీ నాగమణి, తదితరులు పాల్గొన్నారు.