కేటీదొడ్డి, డిసెంబర్ 7 : మండలంలోని పాగుంట లక్ష్మీ వేంకటేశ్వరస్వామిని గద్వాల ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచిన బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి గురువారం దర్శించుకొన్నారు. ముందుగా స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా అర్చకులు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండ్ల మాట్లాడుతూ స్వామివారి ఆశీస్సులు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని కోరారు. స్వామివారి దీవేనలతో మరింత ముందుకు వెళ్తానని, మండల అభివృద్ధికి కట్టుబడి ఉంటానని చెప్పారు. ఎమ్మెల్యేగా బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి మళ్లీ గెలిస్తే 101కొబ్బరికాయలు కొడుతా అని వెంకటాపురం బీఆర్ఎస్ నాయకుడు గోపి మొక్కుకోగా ఎమ్మెల్యేగా బండ్ల గెలవడంతో గురువారం ఆ మొక్కు తీర్చుకున్నాడు. ఆయన వెంట వెంకటాపురం సర్పంచ్ ఆంజనేయులు, నాయకులు పటేల్ ప్రభాకర్‌రెడ్డి, గడ్డం కృష్ణారెడ్డి, శ్రీధర్ కులకర్ణి, గోపి, భగవంతు తదితరులు ఉన్నారు.
ఎమ్మెల్యే బండ్లకు బ్రాహ్మణుల ఆశీర్వాదం
గద్వాల ఎమ్మెల్యేగా రెండోసారి ఎన్నికైన బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిని ఆదిశిలా క్షేత్రం బ్రాహ్మణోత్తములు ఆశీర్వదించారు. స్వయంభూ లక్ష్మీవేంకటేశ్వరస్వామి దేవస్థానం తరఫున చైర్మన్ పట్వారీ ప్రహ్లాదరావు ఆధ్వర్యంలో గురువారం ఎమ్మెల్యే బండ్లను స్వామివారి శేష వస్ర్తాలతో సత్కరించి, పంచామృతాలు అందించి ఆశీర్వదించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో సత్యచంద్రారెడ్డి, అర్చకులు మధుసుదనాచారి, రవి, శశాంకదాస్, చంద్రశేఖర్‌రావు, రాముడు పాల్గొన్నారు.