కమలాపూర్, అక్టోబర్ 4 : మండలంలోని అంబాల గ్రామానికి చెందిన మెట్టుపల్లి రవీందర్ నాలుగు ఉద్యోగాలు సాధించి యువతకు ఆదర్శంగా నిలిచాడు. కనకలక్ష్మి -మొగిలి దంపతుల కుమారుడు రవీందర్ ప్రాథమిక విద్యాభ్యాసం అంబాలలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఇంటర్ హుజూరాబాద్, బీఈడీ వ రంగల్లో పూర్తి చేసినట్లు తెలిపాడు.
ప్రస్తు తం భద్రాచలం మైనార్టీ గురుకుల బాలుర కళాశాల-1లో సివిక్స్ లెక్చరర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇటీవల వెలువడిన గురుకుల ఫలితాల్లో టీజీటీ, పీజీటీ జూనియర్ లెక్చరర్‌గా ఉద్యోగాలు సాధించాడు. టీఎస్పీఎస్సీ విడుదల చేసిన డీఎస్సీ ఫలితాల్లో సాంఘిక శాస్త్ర విభాగంలో స్కూల్ అసిస్టెంట్‌గా ఉద్యోగం సాధించాడు. నాలుగు ఉద్యోగాలు సాధించడం ఆనందంగా ఉందన్నాడు. నిరంతర శ్రమే తన విజయానికి కారణమన్నాడు. ఉద్యోగ సాధనలో కుటుంబ సభ్యుల ప్రోత్సాహం మరువలేనిదని చెప్పాడు.