హనుమకొండ చౌరస్తా : జిల్లాలో పాఠశాల విద్యాభివృద్ధికి (Education development) మండల విద్యాధికారులు కృషి చేయాలని అదనపు కలెక్టర్ ( Additional Collector ) , జిల్లా విద్యాశాఖాధికారి ఏ.వెంకట్‌రెడ్డి ( Venkat Reddy ) అన్నారు. నూతనంగా డీఈవోగా బాధ్యతలు స్వీకరించిన వెంకట్‌రెడ్డిని మంగళవారం జిల్లాలోని మండల విద్యాధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ త్వరలోనే మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి విద్యాభివృద్ధి, సత్ఫలితాలు సాధించడానికి అనుసరించాల్సిన వ్యూహాల గురించి చర్చించనున్నట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు కార్యదర్శి బి.రాంధన్, మండల విద్యాధికారుల సంఘం అధ్యక్షుడు వి.శ్రీనివాస్, ఎంఈవోలు జి.నెహ్రు, బి.మనోజ్‌కుమార్, కె.హనుమంతరావు, ఎల్.రాజేష్‌కుమార్, ఎన్. బిక్షపతి, కె.శ్రీధర్, డీసీఈబీ సహాయ కార్యదర్శి జి.ప్రసన్నకుమార్ ఉన్నారు.
ఎంఈవోల సంఘం అధ్యక్షుడిగా శ్రీనివాస్
జిల్లాలోని మండల విద్యాధికారుల సంఘం అధ్యక్షునిగా హసన్‌పర్తి ఎంఈవో ఏ.శ్రీనివాన్, ప్రధానకార్యదర్శిగా ఆత్మకూర్ ఎంఈవో ఎన్.విజయకుమార్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారిని జిల్లా విద్యాశాఖాధికారి వెంకట్‌రెడ్డి అభినందించారు.