వరంగల్, డిసెంబర్ 20 : యేసుక్రీస్తు బోధించినట్లు దయా కలిగి ఉండాలని, ఇతరుల సేవలో అందరూ కావాలని మేయర్ గుండు సుధారాణి అన్నారు. మంగళవారం నక్కలగుట్ట సర్కిల్ కార్యాలయంలో బిల్ కలెక్టర్స్ అసోషియేషన్ ఆధ్వర్యంలో ప్రీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ ప్రావీణ్య క్రిస్మస్ కేక్ కట్ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రం దేశంలోనే ముందుందన్నారు. సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ కృషిచేస్తున్నారని తెలిపారు. కమిషనర్ ప్రావీణ్య మాట్లాడుతూ శాంతి, కరుణ, దయ, క్షమా గుణాలతో జీవించిన యేసుక్రీస్తు జీవన గమనం నేటికీ ఆచరణీయమన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ రవీందర్ యాదవ్, డిప్యూటీ కమిషనర్లు అనీసుర్ రషీద్, జోనా, శ్రీనివాస్‌రెడ్డి, బల్దియా ఉద్యోగ జేఏసీ అధ్యక్షుడు గౌరిశంకర్, విభాగాల ఉద్యోగులు పాల్గొన్నారు.