బచ్చన్నపేట జూలై 17 : ప్రజలు బ్యాంకు సేవలపై అవగాహన కలిగి ఉండాలని, గ్రామీణ ప్రాంతంలో బ్యాంకు సేవలు విస్తరించాలని ఏపీజీవీబీ బచ్చన్నపేట మేనేజర్ గురుప్రీత్ సింగ్ అన్నారు. గురువారం వి ఎస్ ఆర్ నగర్ గ్రామం లో బ్యాంకు మిత్ర కోనేటి వాణిశ్రీ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామస్తులకు బ్యాంకు సేవలు చేరువ చేయడానికి గ్రామంలో బ్యాంకు మిత్రను ఏర్పాటు చేశామన్నారు.
బ్యాంకులో తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించాలన్నారు. బీమా సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. గ్రామంలోనే డబ్బులు జమ, డ్రా, రుణాలు చెల్లించే అవకాశం కల్పించామన్నారు. గ్రామస్తులు బ్యాంకు సేవలను వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కోనేటి స్వామి, గ్రామస్తులు సత్యనారాయణ, మోతే రాజు, నాగరాజు, నరేశ్, లలిత మౌనిక స్వర్ణ అక్షిత, లక్ష్మి, మహిళా సంఘాల నేతలు పాల్గొన్నారు.