ఐనవోలు, ఏప్రిల్ 7 : ఫాల్గుణ మాసం చివరి ఆదివారం సందర్భంగా బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మ సమేత ఐనవోలు మల్లికార్జునస్వామి కల్యాణ మహోత్సవం కనుల పండువగా నిర్వహించారు. భక్తులు భారీగా తరలిరాగా, మల్లన్న నామస్మరణలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. ఉప ప్రధాన అర్చకుడు పాతర్లపాటి రవీందర్, ముఖ్య అర్చకుడు ఐనవోలు మధుకర్‌శర్మ, వేదపండితుడు గట్టు పురోషోత్తమ శర్మ, విక్రాంత్ వినాయక్ జోషి, ఒగ్గు పూజారులు మజ్జిగ మహేందర్, మజ్జిగ మల్లయ్య, వెంకట నారాయణ పూజలు చేశారు.
ఈవో నాగేశ్వర్రావు, cపాల్గొన్నారు. కల్యాణంలో భాగంగా రాష్ట్రంలోనే అతి పెద్ద పెద్దపట్నం వేశారు. 10గంటల పాటు శ్రమించి 50 ఫీట్ల పొడవు, వెడల్పుతో అందంగా తీర్చిద్దిదారు. పర్వతగిరి సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎస్సైలు అనిల్‌కుమార్, వెంకన్న బందోబస్తు నిర్వహించారు.