KTR | తెలంగాణ ఉద్యమకారుడు ఈదురు జనార్ధన్ కుటుంబానికి అండగా కేటీఆర్.. వీడియో
KTR | జనార్ధన్ ముగ్గురు ఆడబిడ్డల భవిష్యత్తుకు భరోసాగా ఒక్కొక్కరి పేరిట రూ.3 లక్షల చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ చేయించడంతోపాటు ఆయన కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయంగా రూ.లక్ష అందించారు.
KTR | తెలంగాణ ఉద్యమకారుడు ఈదురు జనార్ధన్ కుటుంబానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు. ఈ మేరకు ముగ్గురు ఆడబిడ్డల పేరిట ఒక్కొక్కరికి రూ. 3 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ చేయడంతోపాటు కుటుంబానికి రూ. లక్ష తక్షణ ఆర్థిక సహాయం అందించారు.
తెలంగాణ ఉద్యమంలో మానుకోట సంఘటన నుంచి మొదలుకొని చురుకైన పాత్ర పోషించిన ఉద్యమకారుడు, దళిత కుటుంబానికి చెందిన ఈదురు జనార్ధన్ అనారోగ్యంతో మరణించారు. పేదరికంతో ఇబ్బందులు పడుతూ, కుటుంబ పోషణ కోసం రోజువారీ కూలీగా పనిచేస్తున్న జనార్ధన్ కుటుంబం, ఆయన మరణంతో తీవ్ర ఇబ్బందుల్లో పడింది. జనార్దన్‌కు ముగ్గురు ఆడబిడ్డలు ఉన్నారు. జనార్ధన్ కుటుంబం దీనస్థితిని స్థానిక నాయకులు కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో జనార్ధన్ ముగ్గురు ఆడబిడ్డల భవిష్యత్తుకు భరోసాగా ఒక్కొక్కరి పేరిట రూ.3 లక్షల చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ చేయించడంతోపాటు ఆయన కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయంగా రూ.లక్ష అందించారు.
కేటీఆర్ ఆదేశాల మేరకు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ కవిత, మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్ మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఇతర బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఈదురు జనార్ధన్ నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, కేటీఆర్ అందించిన ఆర్థిక సహాయాన్ని వారికి అందజేశారు.
ఏడాదిన్నర తర్వాత మన ప్రభుత్వం వస్తది..
ఈ సందర్భంగా కేటీఆర్ జనార్దన్ కుటుంబసభ్యులతో ఫోన్లో మాట్లాడి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఏడాదిన్నర తర్వాత తప్పకుండా మన ప్రభుత్వం వస్తది.. ఆ తర్వాత తప్పకుండా మీ పిల్లలకు ఉద్యోగాలు కానీ.. ఇతర సాయం కానీ చేసే బాధ్యత తీసుకుంటామని కేటీఆర్ భరోసానిచ్చారు.
తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన జనార్ధన్ కుటుంబానికి అండగా నిలవాలనే ఉద్దేశంతో కేటీఆర్ ఈ ఆర్థిక సహాయం అందించారు. తెలంగాణ ఉద్యమకారుల కుటుంబాలకు అండగా నిలవాలనే బాధ్యతతో కేటీఆర్ చూపించిన చొరవకు ఈదురు జనార్దన్ కుటుంబసభ్యులు, బీఆర్ఎస్ నాయకులు ధన్యవాదాలు తెలిపారు.
✳️ తెలంగాణ ఉద్యమకారుడు ఈదురు జనార్ధన్ కుటుంబానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS అండ
✳️ ముగ్గురు ఆడబిడ్డల పేరిట ఒక్కొక్కరికి రూ. 3 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్.. కుటుంబానికి రూ. లక్ష తక్షణ ఆర్థిక సహాయం
తెలంగాణ ఉద్యమంలో మానుకోట సంఘటన నుంచి మొదలుకొని చురుకైన పాత్ర పోషించిన ఉద్యమకారుడు, దళిత కుటుంబానికి చెందిన ఈదురు జనార్ధన్ అనారోగ్యంతో మరణించారు. పేదరికంతో ఇబ్బందులు పడుతూ, కుటుంబ పోషణ కోసం రోజువారీ కూలీగా పనిచేస్తున్న జనార్ధన్ కుటుంబం, ఆయన మరణంతో తీవ్ర ఇబ్బందుల్లో పడింది. ఆయనకు ముగ్గురు ఆడబిడ్డలు ఉన్నారు.
జనార్ధన్ కుటుంబం దీనస్థితిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లడంతో.. జనార్ధన్ ముగ్గురు ఆడబిడ్డల భవిష్యత్తుకు భరోసాగా ఒక్కొక్కరి పేరిట రూ.3 లక్షల చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ చేయించడంతో పాటు, కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయంగా రూ. లక్ష అందించారు.
కేటీఆర్ గారి ఆదేశాల మేరకు మాజీ మంత్రి @Satyavathi_BRS, మాజీ ఎంపీ @BRSKavitha, మాజీ ఎమ్మెల్యే @REDYANAIKBRS, మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఇతర బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దివంగత ఈదురు జనార్ధన్ నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, కేటీఆర్ అందించిన ఆర్థిక సహాయాన్ని వారికి అందజేశారు.
తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన జనార్ధన్ కుటుంబానికి అండగా నిలవాలనే ఉద్దేశంతో కేటీఆర్ ఈ ఆర్థిక సహాయం అందించారు.
తెలంగాణ ఉద్యమకారుల కుటుంబాలకు అండగా నిలవాలనే బాధ్యతతో కేటీఆర్ చొరవకు ధన్యవాదాలు తెలిపారు.
— BRS Party (@BRSparty) October 10, 2026
Read Also :
Nara Lokesh | ‘రణబాలి’ ట్రైలర్‌పై నారా లోకేష్ ప్రశంసలు.. విజయ్ దేవరకొండ నటనకు ఫిదా!
Earthquake | పనామాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రత నమోదు..!
భువనగిరి అరోరా కాలేజీలో కలకలం.. విద్యార్థినుల ఫొటోలు, వీడియోలు లీక్.. వైరల్ అవుతున్న ఆడియో కాల్!
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | తెలంగాణ ఉద్యమకారుడు ఈదురు జనార్ధన్ కుటుంబానికి అండగా కేటీఆర్.. వీడియో
KTR Letter | రేడియల్ రోడ్ 2 టెండర్లలో జరిగిన రూ. 3,296 కోట్ల కుంభకోణంపై సమాధానం చెప్పాలి : రేవంత్‌కు కేటీఆర్ లేఖ
విద్యుత్ తీగలకు అడ్డమని పచ్చని చెట్ల నరికివేత
బోండాల కోసం కొబ్బరి చెట్టు నరికివేత.. వ్యక్తి పట్టివేత
‘సూర్యాపేట జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

