మరిపెడ : మరిపెడ జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం 1999-2000 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం((Alumni reunion) జరిగింది. ఆరు నుంచి పదవ తరగతి వరకు చదువుకున్న విద్యార్థులు 25 సంవత్సరాల తర్వాత ఒకచోట కలుసుకొని ఒకరికొకరు యోగక్షేమాలు తెలుసుకున్నారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. చదివిన బడి, నాడు గురువులను నేర్పిన క్రమశిక్షణ, చదువుతో ఈరోజు వివిధ స్థాయిలో ఉన్నామని తెలిపారు.
ఈ సందర్భంగా తమకు పాఠాలు చెప్పిన గురువులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉపాధ్యాయులు గోపాల్ రెడ్డి, వీరస్వామి, సోమయ్య, తిరుమల భిక్షం, పూర్వ విద్యార్థులు భాస్కర్, వీరన్న, ఉపేంద్ర, రవి, డాక్టర్ గోపి, అప్పన్న, దేవేందర్, పరశురాములు, నిర్మల, రాజేశ్వరి, సువర్ణ, భవాని తదితరులు పాల్గొన్నారు.