స్టేషన్ ఘనపూర్, సెప్టెంబర్ 07 : రాష్ట్ర ప్రభుత్వ మెడలు వంచేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త్వరలోనే ప్రజాక్షేత్రంలోకి వస్తున్నాడని బీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు మాచర్ల గణేష్ అన్నారు.
సోమవారం అసెంబ్లీకి వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకోవడం, ప్రజాప్రతినిధులపై దాడి చేయడాన్ని నిరసిస్తూ జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూ మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణిలో ఎంపీడీవో విజయశ్రీకి వినతిపత్రం అందజేశారు. అనంతరం గాంధీ విగ్రహం వద్ద ధర్నా, ఆందోళన నిర్వహించారు.
ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ.. ఆనాడు కేంద్రం మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్, నేడు రాష్ట్ర ప్రభుత్వ మెడలు వంచేందుకు మళ్లీ ప్రజల మధ్యకు వస్తున్నారని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలు, 13 డిక్లరేషన్లు, 420 హామీలను తుంగలో తొక్కిందని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా అసెంబ్లీకి వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకోవడం, ప్రజాప్రతినిధులపై దాడి చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించడం అప్రజాస్వామిక చర్య అని బీఆర్ఎస్ నాయకులు ఖండించారు.
ప్రజల సమస్యలు, హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీసే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ క్రాంతి, కౌన్సిలర్లు పొన్న రాజేష్, అనిల్, మధు, మాజీ సర్పంచ్ సురేష్, ఆకుల కుమార్, మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ చందర్ రెడ్డి, శీలం శ్యామ్, జబ్బర్, చల్లా రఘు రెడ్డి, గుండె రంజిత్, కుంభం కుమార్, నక్క ప్రవీణ్, ఒగ్గు రాజు, చిట్టిబాబు, గుండె మల్లేష్, ఏసుబాబు, అశోక్ హిరాసింగ్, నీలం సుజాత, పావని, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.