కృష్ణకాలనీ, డిసెంబర్ 9 : జిల్లా ప్రజలపై వెయ్యి నామాల వేంకటేశ్వరస్వామి చల్లని చూపు ఉండాలని కోరుకుంటున్నట్లు ఎమ్మె ల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తెలిపారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని చతురూప అయ్యప్ప సహస్ర లింగేశ్వర స్వామి ఆలయంలో శ్రీలక్ష్మి, భూలక్ష్మీ సమేత వెయ్యి నామాల వేంకటేశ్వరుడి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం నిర్వహించగా ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు స్వామివారి విగ్రహానికి పూజలు చేసి ప్రతిష్టించారు. అనంతరం మాట్లాడుతూ వేంకటేశ్వరస్వామి విగ్రహాన్ని ప్రతిష్టించడం సంతోషంగా ఉందన్నారు.
ప్రతిష్ట కార్యక్రమంలో పట్టణ ప్రజలే కాకుం డా, వేంకటేశ్వరస్వామి భక్తులంతా పాల్గొనాలని కోరారు. శుక్రవారం నుంచి 11వ తేదీ ఉదయం 8:20 గంటల వరకు ప్రతిష్ఠాపన కార్యక్రమం ఉంటుందన్నారు. ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూసుకోవాలని స్థానిక ప్రజా ప్రతిధులను ఆదేశించారు. అంతేకాకుడా మూడు రోజులపాటు జరిగే మహోత్సవానికి హాజరయ్యే భక్తులకు ఎమ్మె ల్యే దంపతులు మహాన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో భూపాలపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ సెగ్గం వెంకటరాణీ సిద్ధ్దు, వైస్ చైర్మన్ కొత్త హరిబాబు పటేల్, టీఆర్ఎస్ అర్బన్ అధ్యక్షుడు కటకం జనార్దన్ పటేల్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బుర్ర రమేశ్, కౌన్సిలర్లు సజ్జనపు స్వామి, నూనె రాజు, జక్కం రవికుమార్, ఎడ్ల మౌనికా శ్రీనివాస్, పానుగంటి హారికాశ్రీనివాస్, శిరుప అనిల్, పిల్లలమర్రి శారదా నారాయణ, టీఆర్ఎస్ నాయకులు మంద ల రవీందర్రెడ్డి, లట్ట రాజబాబు, రాజేశ్, ఆలయ కమిటీ అధ్యక్షుడు బండారి రమేశ్, ఉపాధ్యక్షుడు నరేందర్ పాల్గొన్నారు.