Lizard | అపరిశుభ్ర వాతావరణంలో ఆహారాన్నితయారు చేయడంలో ఎన్ని రకాల అనర్ధాలుంటాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రత్యేకించి వీధుల్లో తయారు చేసే ఆహార నాణ్యత పట్ల చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీని కోసం ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా డ్రైవ్ నిర్వహించి నియమ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
కనీస పరిశుభ్రత పాటించకుండా వీధి వ్యాపారులు చేసే నిర్లక్ష్యం ఎలా ఉంటుందో చెప్పే ఘటన ఇది. ఓ వ్యక్తి టిఫిన్ చేసేందుకు వడను ఆర్డర్ ఇచ్చాడు. అయితే వడను తింటుండగా ఊహించని విధంగా అందులో బల్లి కనిపించింది. ఈ ఘటన వరంగల్ జిల్లా కాశిబుగ్గలో వెలుగుచూసింది. వడతోపాటు చట్లీలో బల్లి తల, కాళ్లు కనిపించడంతో ఒక్కసారిగా కంగు తిన్న సదరు కస్టమర్ టిఫిన్ సెంటర్ యజమానిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
కస్టమర్ మీడియాతో మాట్లాడుతూ.. ఇక్కడ ఫుడ్ సేఫ్టీ అసలే లేదు.. ఫుడ్ తింటుంటే వడలో బల్లి తలకాయ వచ్చింది. వడతోపాటు చట్టీలో కూడా అవవేషాలు వచ్చాయి. ఇక్కడ ఫుడ్ సేఫ్ట్ అనేదే లేదు. వరంగల్ జిల్లాలో ఫుడ్ సేఫ్టీ అధికారులు అన్ని హోటళ్లలో తనిఖీలు చేయాలని కోరుతున్నామన్నాడు.
టిఫిన్ చేస్తుండగా వడలో కనిపించిన బల్లి
వరంగల్ జిల్లా కాశీబుగ్గలో ఘటన
టిఫిన్ సెంటర్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాధితుడు pic.twitter.com/Mw9klmgraO
— Telugu Scribe (@TeluguScribe) June 25, 2026