హనుమకొండ చౌరస్తా, జూన్ 2: కాకతీయ విశ్వవిద్యాలయ జాతీయ సేవా పథకం వాలంటీర్, మహిళా ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థిని కృతిక ప్రియ చందన ఎంపికయ్యారు. జూన్ 5, 6 తేదీలలో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం, మినిస్ట్రీ అఫ్ యూత్ ఏంపవర్మెంట్ అండ్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో కర్ణాటక రాష్ట్రం మంగళూరులోని యోనేపోయీ డీమ్డ్ యూనివర్సిటలో జరిగే ‘గ్లోబల్ యూత్ సమ్మిట్ – 2025’ కు ఎంపిక అయినట్టు విశ్వవిద్యాలయ జాతీయ సేవా పధకం ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఆచార్య ఈసం నారాయణ తెలిపారు.
గతంలో కూడా కృతిక ప్రియ చందన జి -20 దేశాల ప్రెసిడెన్సీ వకృత్వ పోటీలలో రాష్ట్రస్థాయి రెండవ బహుమతి సాధించి గవర్నర్ తమిళి సై నుంచి అబినందనలు పొందారు. న్యూ ఢిల్లీ, పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో నిర్వహించిన యూత్ పార్లమెంట్లో పాల్గొన్నారు. ఐ.ఐ.టి రూర్కిలో జరిగిన కార్యక్రమం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కు ఎంపిక అయినట్టు తెలిపారు. కృతిక ప్రియ చందన ను వైస్ ఛాన్సలర్ ఆచార్య కే. ప్రతాప్ రెడ్డి, రిజిస్ట్రార్ ఆచార్య వి. రామచంద్రం, మహిళా ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే. భిక్షాలు అబినందించారు.