స్టేషన్ ఘన్పూర్/వేలేరు, ఫిబ్రవరి 25 : రాబోయే రోజుల్లో స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఉప ఎన్నిక రావడం.. మళ్లీ గులాబీ జెండా ఎగరడం ఖాయమ ని.. అందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మంగళవారం స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య ఆధ్వర్యంలో నియోజకవర్గంలో ని కాంగ్రెస్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధు లు, యువకులు మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో 500 మంది చేరారు.
ధర్మసాగర్ నుంచి మాజీ జడ్పీటీసీ కీర్తి వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ సీనియర్ నేత ముల్కిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ రవీందర్, పీచర మాజీ ఎంపీటీసీ స్వరూప-జంపయ్య, మత్స్యశాఖ సొసైటీ చైర్మన్ ఆల్ల రవి, ధర్మపురం బాలస్వామి, చాగల్లు నుంచి బా స్కుల అనిల్, భాస్కర్, ధర్మసాగర్ మండలానికి చెందిన మాజీ వార్డు సభ్యులు వల్లపురెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, సట్ల రవి, ఎం సాంబరాజు, గొట్టిముక్కుల రాజు, ఎన్.సంపత్, మండల రవి, కమ్మరిపేట మాజీ ఉప సర్పంచ్ సుధాకర్‌తో పాటు అనే క మంది బీఆర్ఎస్ చేరారు. చేరికల కార్యక్రమానికి స్టేషన్ ఘన్పూర్ మండలం నుంచి పార్టీ మండల అధ్యక్షుడు మాచర్ల గణేశ్, కుడా మాజీ డైరెక్టర్ ఆకుల కుమార్, మాజీ సర్పంచ్ తాటి కొండ సురేశ్‌కుమార్, మార్కెట్ కమిటీ మాజీ వై స్ చైర్మన్ చల్లా చందర్‌రెడ్డి, గుండె రంజిత్, కన కం గణేశ్, మాతంగి దేవయ్య, వేలేరు నుంచి మండలం ఇన్చార్జి భూపతిరాజ్, నాయకులు గోవింద సురేశ్, బత్తుల శ్రీనివాస్ హాజరయ్యారు.
ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేరి, ప్రజల సమస్యలు పరిష్కారమయ్యే వరకు బీఆర్ఎస్ పోరాడుతుందని మాజీ ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. బీఆర్ఎస్ బలోపేతానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని, ప్రతి ఒక్కరినీ కంటికిరెప్పలా కాపాడుకుంటానన్నారు. నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరిన వారికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.
అధికార పార్టీని కాదని బీఆర్ఎస్లోకి నాయకులు, యువత పెద్ద ఎత్తున చేరడంతో స్టేషన్ ఘ న్పూర్ నియోజకవర్గంలో మళ్లీ కారు జోరు కనిపిస్తున్నది. దీంతో గులాబీ దళంలో ధైర్యం, ఆ నందం పెరిగింది. త్వరలో సుమారు 2వేల మం ది బీఆర్ఎస్లో చేరనున్నట్లు సమాచారం. కాం గ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేరకపోవడం, రేవంత్‌రెడ్డి పాలనపై ప్రజల్లో అసంతృప్తి, వ్యతిరేకత, తదితర కారణాలతో కాంగ్రెస్ శ్రేణులు బీఆర్ఎస్ వైపు మొగ్గుచూపుతున్నారు. ఇదిలాగే కొనసాగుతుందని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ హవా కొనసాగడం ఖాయం.