భీమదేవరపల్లి, ఏప్రిల్ 10 : తెలంగాణ బహుజన పోరాట యోధుడు చెప్యాల ప్రభాకర్ అని మహనీయుల ఉత్సవ కమిటీ మండల చైర్మన్ కొలుగూరి రాజు అన్నారు. గురువారం మండలంలోని ముల్కనూరు తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద బహుజన ఉద్యమకారుడు చెప్యాల ప్రభాకర్ 56వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పలువురు ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కొలుగూరి రాజు మాట్లాడుతూ మారుమూల కుగ్రామంలో పుట్టి రాజ్యాధికారం కోసం గర్జించిన నాయకుడు ప్రభాకర్ అని కొనియాడారు.
ఆజన్మాంతం బహుజన వాదిగా, అంబేద్కర్ సిద్ధాంత వాదిగా మహనీయుల ఆశయ సాధన కోసం కృషి చేశారని తెలిపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ప్రభాకర్ అలుపెరగని పోరాటం చేశాడని గుర్తు చేశారు. చెప్యాల ప్రభాకర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో షరిపోద్దీన్, మాడుగుల కొమురయ్య, చెప్యాల ప్రకాష్, రేణిగుంట్ల బిక్షపతి మాట్ల వెంకటస్వామి, కండె రమేష్, ఎదులాపురం తిరుపతి, కొమ్ముల రమేష్, మాడుగుల సంపత్, ప్రేమ్ రాజ్, రమేష్, పోగుల శ్రీకాంత్, అజయ్ కుమార్, గుడికందుల విజయ్ ఇల్లందుల బాబన్న, జగదీష్, తాళ్లపల్లి సురేందర్, నల్లగొండ నాగరాజు, అరుణ్ కుమార్, రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.