మల్హర, మే, 20 : మానవ జీవన శైలిలో వస్తున్న మార్పులతో ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తాడిచర్ల, కాపురం గ్రామాల జెన్కో భూనిర్వాసితుల హక్కుల సాధన పోరాట కమిటీ అధ్యక్షుడు కేసారపు రవి అన్నారు. మంగళవారం తాడిచెర్ల, కాపురం గ్రామాల జెన్కో భూనిర్వాసితుల హక్కుల సాధన పోరాట కమిటీ ఆధ్వర్యంలో కరీంనగర్ మెడికవర్ హాస్పిటల్ వారి సహకరంతో తాడిచర్ల పాత గ్రామపంచాయతీ ఆవరణంలో ఉచిత మెగా హెల్త్ క్యాంపు నిర్వహించారు.
బ్లాస్టింగ్ జోన్ దగ్గరగా ఉండి డేంజర్ జోన్లో నివసిస్తున్న గ్రామస్తులు ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ శిబిరంలో 150 మందికి డాక్టర్ దీక్షిత్ ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు చేశారు. అవసరమైన వారికి షుగర్, బీపీ, 2డి ఎకో పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్ సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ మాట్లాడుతూ..గ్రామ ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతోనే ఈ ఉచిత వైద్య శిబిరం నిర్వహించినట్లు తెలిపారు.
మెడికవర్ హాస్పిటల్లో 24 గంటల పాటు అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కోలేటి శ్రీనివాస్, ఇందారపు ప్రవీణ్, ఇందారపు సరీన్, తాండ్ర మార్కు, ఆర్ని ఉదయ్, రామిడి రాజసమయ్య, రామిడి శ్రీకాంత్, దేవర రమేష్, బీర్నేని దుర్గాప్రసాద్, ఖమ్మంపల్లి పర్వతాలు, మెరుగు ఆగయ్య, గట్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.