సంగెం, మే 6 : ప్రభుత్వ భూముల్లో ఇండ్లు నిర్మించుకున్న పేదల ఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణ చేసి, పట్టాలు ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దేనని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. సంగెం మండలంలోని మొండ్రాయి, నార్లవాయి గ్రామాలకు చెందిన జీవో 58 లబ్ధిదారులు మేరుగు కొమురమ్మ, కాసాని పద్మ, నూనెల సుగుణ, దామెర చిన్న రాధ కుటుంబాలకు శనివారం హనుమకొండలోని ఆయన నివాసంలో పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆరే బలమని, అనేక సంక్షేమ పథకాలతో వారిని అన్ని విధాలా ఆదుకుంటున్న ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. రాష్ర్టాభివృద్ధికి నిరంతరం శ్రమించి, ప్రజలకు సంక్షేమ పథకాలతో లబ్ధి చేకూర్చుతున్నారన్నారు. క్రమబద్ధీకరణ దరఖాస్తు గడవు నెల రోజులపాటు పొడిగించారని చెప్పారు. సొంత స్థలాలు ఉండి అర్హులైన ప్రతి ఒక్కరికీ గృహలక్ష్మి పథకం ద్వారా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ గూడ సుదర్శన్‌రెడ్డి, సర్పంచ్‌లు మేరుగు మల్లేశం, కోడూరి రజిత-రమేశ్, మామిడాల సుదర్శన్, ఉపసర్పంచ్ మాదినేని కోటి, బీఆర్ఎస్ నాయకులు కొనకటి మొగిలి, మన్సూర్‌అలీ, కన్నెబోయిన దేవుడు స్వామి, పెండ్లి పురుషోత్తం, కన్నెబోయిన రాజు, జూనియర్ అసిస్టెంట్ రవి పాల్గొన్నారు.
మొగిలిచెర్లలో డీసీసీబీ శాఖ ఏర్పాటు
గీసుగొండ : గ్రేటర్ 15వ డివిజన్లోని మొగిలిచెర్ల గ్రామంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కృషితో డీసీసీబీ శాఖను ఏర్పాటు చేశామని డీసీసీబీ డైరెక్టర్, మొగిలిచెర్ల సొసైటీ చైర్మన్ దొంగల రమేశ్ తెలిపారు. ఈ మేరకు శనివారం కార్పొరేటర్ ఆకులపల్లి మనోహర్‌తోపాటు సొసైటీ డైరెక్టర్లు, గ్రామస్తులు, బీఆర్ఎస్ నాయకులు హనుమకొండలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని కలిశారు. ఆయనకు పూలమాల అందించి, కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మారెడ్డి మాట్లాడుతూ రైతులకు నిరంతరం సేవలందించడానికి మొగిలిచర్లలో డీడీసీ బ్యాంకు శాఖను ఏర్పాటు చేశామన్నారు. మండలంలోని సొసైటీలకు ఈ బ్యాంకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో రైతు బంధు సమితి కన్వీనర్ గజ్జి రాజు, నాయకులు నర్సింగరావు, సతీశ్, శ్రావణ్‌కుమార్, ఉజ్వల్, అశోక్, రఘ, రాజు, ఉమాదేవి, నర్సయ్య పాల్గొన్నారు.