వరంగల్ చౌరస్తా, జూలై 6 : కుటుంబ కలహాల నేపథ్యంలో జీవితంపై విరక్తి చెందిన వ్యక్తి తన భార్యకు వీడియో కాల్ చేసి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్ నగరంలో చర్చనీయాంశమైంది.
వరంగల్ రైల్వే జీఆర్పీ పోలీసులు తెలిపిన ప్రకారం.. సుబేదారి ప్రాంతంలోని ఎస్వీ కాలనీలో నివాసముంటూ డాక్యుమెంట్ రైటర్‌గా జీవనం సాగిస్తున్న లావుడ్య రాజేశ్ (37) కుటుంబ కలహాలతో సోమవారం ఉదయం కాజీపేట-వరంగల్ మధ్య రైలు పట్టాలపై నిల్చొని తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు భార్య విజయకు వీడియో కాల్ చేశాడు.
ఆమె చూస్తుండగానే గుర్తు తెలియని రైలు ఢీకొని పట్టాల పక్కన పడి అక్కడికక్కడే మృతిచెందాడు. వరంగల్ రైల్వే పోలీసులు పంచనామా నిర్వహించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎంహెచ్ మార్చురీకి తరలించారు. శవపరీక్షల అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.