హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 5: అమెరికాలోని లాస్ ఏంజెల్స్తెలుగు అసోసియేషన్ (ఎల్ఏటీఏ) కార్యవర్గ సభ్యుడిగా హనుమకొండ వడ్డేపల్లి ఎన్జీవోస్కాలనీకి చెందిన కాసుల పృధీష్ ఎన్నికయ్యారు. ఇటీవలి జరిగిన ఎన్నికల్లో సభ్యుల మద్దతుతో ఆయనకు ఈ బాధ్యత లభించింది. తెలుగు సమాజసేవ, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణలో చురుకుగా పనిచేస్తున్న పృధీష్ కార్యవర్గ సభ్యుడిగా ఎన్నిక కావడంపై ఆనందం వ్యక్తం చేశారు.
విదేశాల్లో తెలుగు సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు తోడు, యువత-భవిత అభివృద్ధి దిశగా సంస్థ చేపడుతున్న సేవా కార్యక్రమాలను మరింతగా విస్తరించేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా పృద్వీష్ తెలిపారు. తన ఎన్నికపై సంఘ నాయకులు, సభ్యులు, హనుమకొండ జిల్లా ప్రజలు అభినందనలు తెలిపారు.