పుష్కర మహోత్సవంతో గోదావరి కొత్త శోభను సంతరించుకున్నది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి స్నానాలు ఆచరిస్తుండడంతో నదీమ తల్లి పరవశిస్తున్నది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో నిర్వహిస్తున్న సరస్వతీ పుషరాలు శుక్రవారం రెండో రోజుకు చేరుకోగా, భక్తుల రద్దీ స్పల్పంగా పెరి గింది. సౌకర్యాలు కల్పించకపోవడంతో భక్తజనం ఇబ్బంది పడింది. త్రివేణి సంగమం వద్ద తాగునీటికి అవస్థలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అధికారుల తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతున్నది.
– మహదేవపూర్(కాళేశ్వరం), మే 16
సరస్వతీ పుష్కరాలకు మొదటిరోజు అంతంత మాత్రమే ఉన్న భక్తుల సంఖ్య రెండో రోజు కొంత పెరిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌తో పాటు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చి వీఐపీ ఘాట్ వద్ద త్రివేణి సంగమంలో పవిత్ర పుణ్యస్నానాలు సరస్వతీ మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు గోదావరి నదిలో దీపాలు, ఒడి వదిలారు. పిండ ప్రదానాలు, పితృతర్పణాలు సమర్పించారు. 17 అడుగుల అమ్మవారి విగ్రహానికి పూ జలు చేశారు.
సెల్ఫీలు దిగి సంబురపడ్డారు. అనంతరం శ్రీకాళేశ్వర ముక్తేశ్వర ఆలయంలో స్వామి వారిని దర్శించుకున్నారు. కాగా, వీఐపీ ఘాట్ వద్ద సరిపడా సౌకర్యాలు లేక భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. షవర్లు అలంకారప్రాయంగా మారాయి. త్రివేణి సంగమం వద్ద తాగునీరు లేకపోవడంతో అవస్థలు పడ్డారు. అధికారుల నిర్లక్ష్య వైఖరిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భక్తులకు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయకపోవడం దారుణమని భక్తులు అసహనం వ్యక్తం చేశారు.
భానుడి ప్రతా పానికి తట్టుకోలేక భక్తులు సొమ్మసిల్లిపోయారు. కొందరు ఇసుకలో నడవలేక ఎడ్లబండ్లలో ఘాట్‌కు వెళ్లారు. కాగా, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క దంపతులు రాత్రి త్రివేణి సంగమంలో పవిత్ర పుణ్యస్నానాలాచరించారు. పూజలు చేసి గోదావరికి చీర, సారె సమర్పించారు. సరస్వతీ మాతను దర్శించుకున్నారు. అనంతరం వేద పండితుల ఆధ్వర్యంలో చేపట్టిన నవరత్న హారతిని వీక్షించారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్, కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే పాల్గొన్నారు.
సౌకర్యాలు బాగా లేవు..
కాళేశ్వరంలో సరస్వతీ పుషరాలకు సౌకర్యాలు కల్పించలేదు. చిన్నారులు, వృద్ధులు ఘాట్ నుంచి త్రివేణి సంగమం వరకు నడవలేని పరిస్థితి ఉంది. వాహనం ఎకడో పార్ చేసి ఇంత దూరం ఎండలో నడవడం చాలా కష్టంగా ఉంది. సంగమ తీరంలో అకడకడా తాగునీటి వసతి లేక తీవ్ర ఇబ్బందులు పడ్డాం. సరిపడా సౌకర్యాలు లేక నిరాశ చెందాం. అధికారులు స్పందించి సరైన వసతులు ఏర్పాటు చేయాలి.
– వెంకటేశ్వర్లు, నర్సంపేట