Kakatiya University | హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 19 : జనగామ పట్టణంలోని ధర్మకంచ కాలనీలో నివసించే నిరుపేద కుటుంబానికి చెందిన నమిలే ఎల్లయ్య- బలమని దంపతుల కుమారుడు నమిలే సుమన్‌కు అంతర్జాతీయస్థాయిలో మరో గొప్ప గౌరవం దక్కింది.
ఈనెల 18 నుంచి 20 వరకు మలేసియాలోని యూనివర్సిటీ టెక్నాలజీ మరాలో జరగనున్న ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సదస్సులో ఆయన పాల్గొని ‘ఎఫెక్ట్ ఆఫ్ మెథడ్స్ ఆన్ ట్రైబల్ అండ్ నాన్-ట్రైబల్ యూనివర్సిటీ అథ్లెటీస్’ అనే అంశంపై ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. సుమన్ కాకతీయ యూనివర్సిటీలో బీపీఈడీ, ఎంపీఈడీ పూర్తి చేసి, అథ్లెటిక్స్ రంగంలో విశేష ప్రతిభ కనబర్చారు. ప్రస్తుతం సుమన్ కాకతీయ యూనివర్సిటీలో నిట్ ప్రొఫెసర్ పి.రవికుమార్ పర్యవేక్షణలో పరిశోధన కొనసాగిస్తున్నారు. రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతున్న సుమన్‌కు కాకతీయ యూనివర్సిటీ అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు ,అథ్లెటిక్స్ సంఘాలు, ఫిజికల్ ఎడ్యుకేషన్ విద్యార్థులు శుభాకాంక్షలు తెలిపారు.