నెక్కొండ జూలై 01: వానకాలం సీజన్‌కు సరిపడా సరఫరా చేసేందుకు జిల్లాలో యూనియన్ సిద్ధంగా ఉన్నామని జిల్లా వ్యవసాయ అధికారి కే అనురాధ అన్నారు. నెక్కొండలో మంగళవారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంతో పాటు పలు ఎరువులు, విత్తనాల షాపులను ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుత వానాకాలం కు సంబంధించి పత్తి, మొక్కజొన్న, వరి పంటలకు సరిపడు యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని మండలాలకు పంట దశలను బట్టి క్రమం తప్పకుండా యూరియా పంపిణీ కొనసాగుతుందన్నారు.
రైతులు యూరియా కోసం ఆందోళన చెందకూడన్నారు. రైతులు పంట మొత్తానికి సరిపడా యూరియాను ఒకేసారి తీసుకోవద్దన్నారు. అవసరానికి మించి రైతులు నిలువ చేయకూడదన్నారు. అధిక యూరియా వాడకంతో పంటలలో పురుగులు, తెగుళ్ల ఉధృతి పెరిగి దిగుబడులు తగ్గుతాయన్నారు. యూరియా వాడకాన్ని తగ్గించి నానో యూరియా, నాను డీఏపీలను పంటల మీద పిచికారి చేసుకొని మంచిదిగుబడులు పొందవచ్చని సూచించారు. తనిఖీల్లో నెక్కొండ వ్యవసాయ అధికారి ఏ నాగరాజు, ఏఈవోలు పాల్గొన్నారు.