హసన్‌పర్తి : కాంగ్రెస్ ప్రభుత్వానికి అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ అన్నదాతల మీద లేదు. ఆకాల వర్షాలకు రైతులు నష్టపోతుంటే వారిని పట్టించుకోని రేవంత్ సర్కారు వరంగల్‌లో అందాల భామల పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులను అక్రమ అరెస్టులు చేయడం సిగ్గుమాలిన చర్యని బీఆర్ఎస్వీ విద్యార్థి నాయకుడు (కాకతీయ యూనివర్సిటీ ఇంచార్జ్) జెట్టి రాజేందర్ దుయ్యబట్టారు.
బుధవారం ఉదయం 5.గంటల సమయంలో మండలంలోని బైరాన్పల్లిలోని ఆయన నివాసంలో రాజేందర్‌ను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి హసన్‌పర్తి పోలీస్ స్టేషన్‌కు తరలించారాని చెప్పారు. ఇలాంటి అరెస్టులతో ప్రశ్నించే మా గొంతును ఆపలేరని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయడం లేదని ఎద్దేవా చేశారు. 420 హామీలను అమలు చేసేంతవరకు బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో నిరసనలు వ్యక్తం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.