జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలోని కాళేశ్వరం- ముక్తీశ్వర స్వామి వారికి భక్తులు పోటెత్తుతున్నారు. ప్రాణహిత పుష్కరాల సందర్భంగా స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నాఉ. కాగా, ఆదివారం లోకాయుక్త జడ్జి వి. నిరంజన్ రావు సతీసమేతంగా ముక్తీశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అంతకు ముందు ఆలయ అధికారులు, అర్చకులు ఆయనకు స్వాగతం పలికారు. పూజల అనంతరం స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.