Bank Robbery | మహదేవపూర్,(మల్హర్) : సినిమా స్టైల్లో దొంగతనం చేసేందుకు వచ్చిన ఓ ముఠా వారి వెంట తెచ్చుకున్న గ్యాస్ లీకవడంతో వెనుదిరిగిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్‌పూర్ మండలంలోని కొయ్యూ రు తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌లో బుధవారం రాత్రి జరిగింది.
సీఐ రంజిత్ రావు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు బ్యాంకు సమీపంలో ఉన్న వెల్డింగ్ షాపులోని గ్యాస్ కట్టర్, సిలిండర్ దొంగతనం చేశారు. వాటితో బ్యాంక్ ప్రక్కనే ఉన్న చిన్న గేటును గ్యాస్ కట్టర్‌తో కట్ చేసి లోపలికి చొరబడ్డారు. లోపల ఉన్న సీసీ కెమెరాలను తొలగించి బ్యాంక్ కిటికీలను కట్ చేస్తుండగా గ్యాస్ లీకయింది. దీంతో వారు సిలిండర్, గ్యాస్ కట్టర్‌ను అక్కడే వదిలేసి పారిపోయినట్లు గుర్తించామని సీఐ వెల్లడించారు. బ్యాంకులో నగదు దోచుకెళ్లలేదని, ఎస్సీ సురేందర్‌రెడ్డి ఆదేశాల మేరకు క్లూస్ టీం సహాయంతో ఫింగర్ ప్రింట్స్ సేకరిస్తున్నట్లు తెలిపారు. అనంతరం బ్యాంక్‌లో ఉన్న సీసీ కెమెరాల్లో ఫుటేజీలు పరిశీలించారు.
బ్యాంక్ కిటికీలు కోసేందుకు దుండగులు వాడిన గ్యాస్ సిలిండర్, కట్టర్