మత్స్యకారుల కోసం ప్రత్యేక పథకాలు
మార్కెటింగ్‌కు సబ్సిడీపై వాహనాలు
స్టేషన్‌ఘన్‌ఫూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య
అశ్వరావుపల్లి రిజర్వాయర్‌లో చేపపిల్లలు విడుదల
రఘునాథపల్లి డిసెంబర్ 28: టీఆర్ఎస్ పాలనలోనే వృత్తిదారులకు చేయూతలభిస్తున్నదని, ఇందుకనుగుణంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని స్టేషన్‌ఘన్‌ఫూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. ప్రభుత్వం అందించిన ఉచిత చేప పిల్లలను మండలంలోని అశ్వరావుపల్లి రిజర్వాయర్‌లో మంగళవారం టీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సాగు నీటి ప్రాజెక్టులు నిర్మించడంతో రిజర్వాయర్లు, చెరువుల్లో సమృద్ధిగా నీరు చేరుతున్నదన్నారు. దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా జలాశయాలు నిండుకుండను తలపిస్తున్నాయని, దీంతో మత్స్యకారుల కోసం ప్రభుత్వం ఉచితంగా చేపపిల్లలను విడుదల చేస్తున్నదన్నారు. వీటితో ఉపాధి లభిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అశ్వరాపల్లి రిజర్వాయర్‌లో 5.79 కోట్ల చేప పిల్లలను విడుదల చేసేందుకు అవకాశమిచ్చిందన్నారు. వీటిద్వారా మత్స్యకారులకు ఉపాధి లభిస్తుందని ఆయన వివరించారు.
వలసలను నివారించేందుకు తెలంగాణ సర్కారు చర్యలు
సమైక్య పాలనలో వృత్తిదారులకు చేయూతలేకపోవడంతో ఉఫాధి కరువై వలస వెళ్లారని ఎమ్మెల్యే రాజయ్య తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ అన్నివర్గాల సంక్షేమానికి పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నారని వివరించారు. మత్స్యకారులకు ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేస్తున్నారని, గొల్లకురుమలకు సబ్సిడీపై గొర్రెలను అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. స్టేషన్‌ఘన్‌ఫూర్ నియోజకవర్గంలో చెరువులు, కుంటల్లో సమృద్ధిగా నీళ్లున్నాయని, దీంతో మత్స్య సంపద పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు బొల్లం అజయ్‌కుమార్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వారాల రమేశ్‌యాదవ్, సర్పంచ్ల ఫో రం జిల్లా అధ్యక్షుడు పోకల శివకుమార్, టీఆర్ఎస్ మండల కార్యదర్శి ముసిపట్ల విజయ్, స్టేషన్‌ఘన్‌ఫూర్ నియోజకవర్గ మహిళా ఇన్చార్జి మండలపల్లి సునీత, మండల కార్యదర్శి తిప్పారపు రమ్య, మమత, రాష్ట్ర నాయకుడు నామాల బుచ్చయ్య, యూత్ జిల్లా నాయకులు కుర్ర కమలాకర్, మండల అధ్యక్షుడు హరీశ్‌గౌడ్, లోకుంట్ల సృజన్, సర్పంచ్ సురేందర్‌రెడ్డి, ఎంపీటీసీ సుల్తాన్ దేవేందర్‌రెడ్డి, గ్రామ అధ్యక్షుడు నీల ఆగయ్య, నాయకులు బండి కుమార్, కంచనపల్లి ఎంపీటీసీ కేమిడి రమ్యరాజు, శివరాత్రి కొమురయ్య, ముక్క పరశురామలు పాల్గొన్నారు.