చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు
మార్మోగిన యేసుక్రీస్తు కీర్తనలు
భూపాలపల్లిలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర
భూపాలపల్లి రూరల్/కృష్ణకాలనీ/గణపురం/ములుగు రూరల్, డిసెంబర్ 25: క్రిస్మస్ పండుగ జయశంకర్ భూపాల పల్లి, ములుగు జిల్లాల్లో శనివారం ఘనంగా జరిగింది. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని మంజూర్‌నగర్ కల్వరి చర్చిలో పాస్టర్ రాజ్‌కుమార్, సుభాష్‌కాలనీలోని బేతెస్త చర్చిలో పాస్టర్ రాజవీరు ప్రార్థనలు చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సీఎస్ఐ, సీయోను ప్రార్థన మందిరం, మదీన కాలనీలోని ఎల్ఏఎఫ్ యేసు మందిరంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు. క్రిస్మస్ కేక్ కట్ చేసి, క్రైస్తవులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏసుక్రీస్తు ప్రజలకు ప్రేమ, ఆప్యాయతను పంచారని, ఆయన చూపిన ప్రేమ, కరుణ, శాంతి మార్గా ల్లో పయనించాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని చర్చిల అభివృద్ధికి పెద్దపీట వేసిందని, సీఎం కేసీఆర్ పాలనలో క్రైస్తవ సోదరులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో భూపాలపల్లి మున్సిపల్ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణి సిద్దు, వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, కౌన్సిలర్ శిరుప అనిల్, కోఆప్షన్ మెంబర్ కమల, టీఆర్ఎస్ భూపాలపల్లి అర్భన్ అధ్యక్షుడు కటకం జనార్థన్పటేల్, మాజీ అధ్యక్షుడు క్యాత రాజు సాంబమూర్తి, టీఆర్ఎస్ నాయకుడు బుర్ర రమేష్, అర్భన్ ఉపాధ్యక్షుడు బుర్ర సదానందం, ఎండీ కరీం, బాబర్‌పాషా, ప్రేమ్ పాల్గొన్నారు. గణపురం మండలం కర్కపల్లి గ్రామ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే గండ్ర పాల్గొన్నారు. క్రిస్మస్ కేక్ కట్ చేసిన తర్వాత పేదలకు వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. గణపురం పీఏసీఎస్ చైర్మన్ పోరెడ్డి పూర్ణచందర్‌రెడ్డి, గణపురం మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు పోట్ల నగేష్, గణపురం సర్పంచ్ నారగాని దేవేందర్‌గౌడ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ములుగు జిల్లా కేంద్రంలోని జీవజలముల ప్రార్థన మందిరం, హోలీమినిస్ట్రీస్, సీఎస్ఐ చర్చి, లిటిల్‌ఫ్లవర్ స్కూల్ ఆవరణలోని చర్చిలతోపాటు జాకారం, మల్లంపల్లి, జంగాలపల్లి, దేవగిరిపట్నం గ్రామాల్లోని చర్చిల్లో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. యేసుక్రీస్తు జననంపై బైబిల్లోని అంశాలను పాస్టర్లు వివరించారు. ములుగు జిల్లా కేంద్రంలోని జీవజలముల ప్రార్థన మందిరంలో పాస్లర్లు పోగుల సుదర్శన్‌రావు-లూదియ, శాంతికుమార్, ప్రభుకిరణ్ రాజ్ ప్రభుత్వం క్రైస్తవులకు అందించిన కానుకలను క్రైస్తవులకు పంపిణీ చేశారు. అనంతరం క్రిస్మస్ కేక్‌ను కట్ చేశారు. చిన్నారులు చర్చిల్లో యేసుక్రీస్తు పాటలకు నృత్యాలు చేశారు.