ములుగు టౌన్, డిసెంబర్ 22: ప్రతి వినియోగదారుడు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. జాతీయ వినియోగదారులు దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం కలెక్టరేట్లో వినియోగదారుల దినోత్సవ కరపత్రాన్ని ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వినియోగదారులు చట్టప్రకారం వస్తువులు, వాటి నాణ్యత సామర్థ్యం, స్వచ్ఛత, పలు అంశాలపై తమ హక్కుల వినియోగించు కోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వినియోగదారుల సమాఖ్య అధ్యక్షుడు చల్లగురుగుల మల్లయ్య, సంగ రంజిత్ వినియోగదారుల ఉద్యమకారులు కాళిదాసు, విజయరామారావు, రమేష్, రవి, రాజు పాల్గొన్నారు.
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో…
ములుగు రూరల్, డిసెంబర్ 22: వినియోగదారుల హక్కుల చట్టాలపై విద్యార్థులు అవగాహన పెంపొందించుకోవాలని వరంగల్ ఉమ్మడి జిల్లా వినియోగదారుల ఫోరం అధ్యక్షుడు రజన్సింగ్ ఠాకూర్ అన్నారు. బుధవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ రజనీలత అధ్యక్షతన విద్యార్థులకు వినియోగదారుల చట్టాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వినియోగదారుల సమాఖ్య జిల్లా అధ్యక్షుడు మల్లయ్య కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
బాలల హక్కులపై అవగాహన
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మహిళా సాధికారత విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులకు బాలల హక్కులపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఐసీపీఎస్ చైల్డ్‌లైన్ కోఆర్డినేటర్ ప్రణయ్ మాట్లాడుతూ విద్యార్థులు వారి కుటుంబాల్లో, గ్రామాల్లో పిల్లలు, బాలికల హక్కులపై అవగాహన కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీపీఎస్ సిబ్బంది, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.