దేవరుప్పుల, డిసెంబర్ 21 : కల్యాణలక్ష్మి ఆడబిడ్డలకు వరమని ఎంపీపీ బస్వ సావిత్రి పేర్కొన్నారు. మండలంలోని సీతారాపురం, సింగరాజుపల్లి, కామారెడ్డిగూడెం గ్రామాల్లో మంగళవారం సీఎం కేసీఆర్ ఆయా ఇంటి పెద్దన్నగా అందించిన కల్యాణలక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు వారి ఇంటి వద్దే అందజేసి వారి కండ్లలో వెలుగును నింపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆడబిడ్డలు ఉన్న తల్లిదండ్రులు భరోసాతో ఉన్నారని, ఇలాంటి అద్బుత పథకం దేశంలో ఏరాష్ట్రంలో లేదన్నారు. మండల వ్యాప్తంగా 54 మంది లబ్ధ్దిదారులకు ఈ చెక్కులు తహసీల్దార్ కార్యాలయానికి రాగా, వాటిని ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు లబ్దిదారులకు అందించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కత్తుల విజయ్‌కుమార్, సీతారాంపురం సర్పంచ్ రెడ్డిరాజుల రమేశ్, సింగరాజుపల్లి సర్పంచ్ గోపాల్‌దాస్ మల్లేశ్, కామారెడ్డిగూడెం సర్పంచ్ బిళ్ల అంజమ్మ, ఆయా గ్రామాల ఉపసర్పంచ్లు కొండాచిన బుచ్చిరెడ్డి, మరాఠి కృష్ణ, మహ్మద్ పాషా, టీఆర్ఎస్ మండల ప్రధానకార్యదర్శి చింత రవి, ఆయా గ్రామాల టీఆర్ఎస్ అధ్యక్షుడు మేకపోతుల నర్సింహులు, ఎల్లబోయిన గిరియాదవ్, బస్వ వెంకన్న, ప్రజాప్రతినిధులు మాజీ సర్పంచ్ బస్వ మల్లేశ్, చింత సోమయ్య, మొల్గూరు రమేశ్, బిళ్ల యాదవరెడ్డి, యాకూబ్ తదితరులు ఉన్నారు.