న్యూఢిల్లీ: సంచలన యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ(Vaibhav Suryavanshi) ఈ ఏడాది పదో తరగతి బోర్డు పరీక్షలు మిస్ కానున్నాడు. అతను ఆ పరీక్షలు ఈ ఏడాది రాయడం లేదని తెలిసింది. తాజాగా ముగిసిన అండర్19 వరల్డ్‌కప్‌లో దుమ్మురేపిన వైభవ్.. ప్రస్తుతం రాబోయే ఐపీఎల్ కోసం శిక్షణ తీసుకుంటున్నాడు. దీంతో అతను పదో తరగతి బోర్డు పరీక్షలను డుమ్మా కొట్టనున్నాడు. 14 ఏళ్ల సూర్యవంశీ బీహార్‌లోని తాజ్పుర్లో ఉన్న మోడెస్టీ స్కూల్లో చదువుతున్నాడు. అయితే బీహార్‌లో పదో తరగతి బోర్డు ఎగ్జామ్స్ ఫిబ్రవరి 17వ తేదీ నుంచి మార్చి 11వ తేదీ వరకు నిర్వహించనున్నారు.
గత ఏడాది మొత్తం అండర్19, ఇండియా-ఏ తరపు బిజీ క్రికెట్ ఆడిన వైభవ్.. బోర్డు పరీక్షలకు పెద్దగా ప్రిపేర్ కాలేదు. సూర్యవంశీ కోచ్ మనిష్ ఓజా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశాడు. ఐపీఎల్ కోసం ప్రిపేరవుతున్న వైభవ్ .. ఆ టోర్నీలో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడనున్నాడు. ప్రస్తుతం నాగపూర్‌లో జరుగుతున్న ట్రైనింగ్ క్యాంపులో అతను శిక్షణ పొందుతున్నాడు. అండర్ 19 వరల్డ్‌కప్ ఫైనల్లో సూర్యవంశీ సూపర్ సెంచరీ కొట్టిన విషయం తెలిసిందే.
ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్లో అతను 80 బంతుల్లో 175 రన్స్ చేశాడు. ఇక ఆ టోర్నీలో ఏడు మ్యాచుల్లో వైభవ్ 439 రన్స్ చేశాడు. 62.71 సగటు.. 170 స్ట్రయిక్ రేట్‌తో అతను బ్యాటింగ్ చేశాడు. వరల్డ్‌కప్‌లో అత్యధిక పరుగులు సాధించిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు.