వ్యాక్సినేషన్‌ను పరిశీలించిన జాయింట్, అదనపు కలెక్టర్లు స్వర్ణలత, ఇలా త్రిపాఠి
వాజేడు, డిసెంబర్ 10 : అర్హులందరికీ వ్యాక్సిన్ వేయాలని అడిషనల్ కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు. మండలంలోని మొరుమురుకాలనీ, శ్రీరాంనగర్ గ్రామాల్లో వ్యాక్షిన్ వేసుకుంటున్న వారితో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ మొదటి, రెండో డోస్ వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. పేరూరు పీహెచ్సీ పరిధిలో ధర్మవరం, శ్రీరాంనగర్ గ్రామాల పరిధిలోని 357మందికి వ్యాక్సిన్ వేసినట్లు వైద్యాధికారి సీతారామరాజు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ రాజ్‌కుమార్, ఎంపీడీవో విజయ, హెల్త్‌సూపర్‌వైజర్ కోటిరెడ్డి, వైద్య, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
మర్రిగూడెంలో..
వెంకటాపురం (నూగూరు) : మండలంలోని బీసీ మర్రిగూడెం గ్రామంలో అడిషనల్ కలెక్టర్ ఇలా త్రిపాఠి పర్యటించారు. వ్యాక్సినేషన్‌ను పరిశీలించిన ఆమె అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో వైద్యాధికారి అల్లి నరేష్, వైద్య, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
గర్భిణులు, బాలింతలు వ్యాక్సిన్ వేసుకోవాలి
పలిమెల: గర్భిణులు, బాలింతలు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేసుకోవా లని ఏఎన్ఎం శ్రీలత అన్నారు. మహదేవపూర్ మండలం పెద్దంపేట, పలిమెల మండ లం లెంకలగడ్డలో వ్యాక్సినేషన్ నిర్వహించారు. కార్యక్రమంలో ఆశావర్కర్ చిడం నిర్మల, అంగన్వాడీ టీచర్ అగ్గు నిర్మల తదితరులు పాల్గొన్నారు.
వ్యాక్సిన్ వేసుకుని కరోనాను కట్టడి చేయాలి
చిట్యాల: మండలకేంద్రంలో చేపట్టిన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని భూపాలపల్లి జాయింట్ కలెక్టర్ కూరాకుల స్వర్ణలత శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు. ఒమిక్రాస్ వైరస్ నుంచి రక్షణ పొందేందుకు వ్యాక్సిన్ వేసుకోవాలన్నారు. దానికి తోడు మాస్కులు ధరిస్తూ భౌతిక దూరం పాటించాలన్నారు. అనంతరం ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దార్ సాయిని సతీశ్‌కుమార్, డీటీ సత్యనారాయణరావు, సర్పంచ్ నారగాని దేవేందర్ గౌడ్, ఏవోలు వంశీ, సతీశ్, వీఆర్ ఏలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.