రైతన్నల్లో దూది పూల సంబురం
కాసులు కురిపిస్తున్న తెల్లబంగారం
కేసముద్రం, ఎనుమాముల మార్కెట్లలో క్వింటాకు రూ. 9501, రూ. 9310
కాశీబుగ్గ/కేసముద్రం, జనవరి3: పత్తిని నమ్ముకున్న రైతులకు ఈ ఏడాది కాసుల వర్షం కురు స్తోంది. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ల లో బేళ్ల ధర, గింజల ధర అధికంగా ఉండడం, సాగు విస్తీ ర్ణం తగ్గడంతో పత్తికి మంచి డిమాండ్ వచ్చింది. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మహబూబాబా ద్ జిల్లా కేసముద్రం మార్కెట్లో సోమవారం పత్తి ధర క్వింటాల్‌కి రూ.9501 పలికింది. అదేవి ధంగా ఎనుమాముల మార్కెట్లో రూ. 9310తో వ్యాపారులు కొనుగోలు చేశారు. మూడు, నాలు గేళ్లుగా పత్తి రైతులు నష్టాలను చూడాల్సి వచ్చింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా పత్తి సాగు చేయాలని సూచించిం ది. ఈమేరకు రైతులు కొంత మేర సాగు విస్తీర్ణాన్ని తగ్గించారు. దీంతో వాతావరణ పరిస్థితుల వల్ల పూత, కాత రాలి పోయి దిగుబడి తగ్గింది. ఎకరానికి సుమారు 10 క్వింటాల దిగుబడి రావాల్సి ఉండగా 5 క్వింటాళ్లే దిగుబడి వస్తోంది. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండ్‌కు సరిపడా పత్తి లేకపోవడంతో ధర అనూహ్యంగా పెరిగి పో యింది. కేసముద్రం మార్కెట్లో గత నెల 29 న క్వింటాల్ పత్తి ధర రూ. 8901, 30న రూ. 90 10 పలుకగా, 31న 9301 ధర పలికింది. ఇక ఎనుమాముల మార్కెట్లో పత్తి సీజన్ అక్టోబర్ నుంచి ప్రారంభం కాగా, అత్యధికంగా రికార్డుస్థా యిలో పత్తికి ధర పలికింది. ఇప్పటివరకు మార్కెట్ చరిత్రలోనే క్వింటాల్‌కు రూ. 9310 పలికింది. సోమవారం 4569 క్వింటాళ్ల పత్తి రాగా, అత్యధి కంగా రూ. 9310, మధ్య రకానికి రూ.8900, కనిష్ఠంగా రూ.7500 పలికాయి. సీజన్లో ఇప్పటి వరకు 3 లక్షల 71వేల 901 క్వింటాళ్ల పత్తి వచ్చింది.