రాయపర్తి, జనవరి 2 : మండలంలోని ఊకల్ గ్రామంలో ఆదివారం స్వచ్ఛ సర్వేక్షణ్ కేంద్ర బృందం ప్రతినిధులు పర్యటించారు. మహ్మద్ దస్తగిరి సారథ్యంలో వ్యక్తిగత మరుగుదొడ్ల వినియోగం, ఇంకుడు గుంతల నిర్మాణాలు, పారిశుధ్యం, మొక్కల పెంపకం తదితర పనులను పరిశీలించారు. పల్లె ప్రగతిలో భాగంగా గ్రామంలో నూతనంగా నిర్మించిన డంపింగ్ యార్డు, వైకుంఠధామం, నర్సరీల వినియోగంపై గ్రామస్తులతో చర్చించారు. జీపీ ట్రాక్టర్‌ను వినియోగించుకోవాలని, ఇండ్ల వద్దే తడి, పొడి చెత్తను వేరు చేసి అందజేయాలని సూచించారు. కార్యక్రమంలో కేంద్ర బృందం సభ్యుడు విజయ్‌కుమార్, డీపీవో నాగపురి స్వరూప, ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, ఎంపీడీవో గుగులోత్ కిషన్‌నాయక్, ఎంపీవో తుల రామ్మోహన్, ఏపీఎం పులుసు అశోక్‌కుమార్, ఏపీవో దొణికెల కుమార్‌గౌడ్, సర్పంచ్ కుంచారపు హరినాథ్, ఎంపీటీసీ నార్లాపురం రాజు, పంచాయతీ కార్యదర్శులు దామెరుప్పుల శాంతిరాజు, గుగులోత్ అశోక్‌నాయక్, కారోబార్ మండల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
చెన్నారావుపేటలో..
చెన్నారావుపేట : మండలంలోని ఉప్పరపల్లిలో స్వచ్ఛ సర్వేక్షణ్ కేంద్ర బృందం సభ్యురాలు మౌనిక పర్యటించారు. అభివృద్ధిపై అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డీఎల్పీవో వెంకటేశ్వర్లు, ఎంపీవో గౌడ సురేశ్, సర్పంచ్ పెరుమాండ్ల శ్రీధర్‌రెడ్డి, ఎంపీటీసీ సీహెచ్ విజేందర్‌రెడ్డి, ఉప సర్పంచ్ కాసాని రమేశ్, ఈసీ కిశోర్, కార్యదర్శి ఎండీ షకీల్‌అహ్మద్ పాల్గొన్నారు.