జనగామ రూరల్ మార్చి19 : జనగామ మండలం పెంబర్తి గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో చలో జనగాం పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గౌడ సంఘం అధ్యక్షుడు బైరి బాలరాజు గౌడ్ మాట్లాడుతూ.. జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న(Sardar Sarvai Papanna) పేరు పెట్టాలని ఈనెల 21న తేదీన జరిగే ఒక రోజు దీక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు గ్రామ ప్రజలు, బహుజన అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపును ఇచ్చారు.
జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు అంబాల శ్రీనివాస్ గౌడ్, అంబాల ఆంజనేయులు గౌడ్, బాలగాని శ్రీనివాస్ గౌడ్, ఆవుల రాజిరెడ్డి, ఆవుల ప్రభాకర్ రెడ్డి, ఆత్మకూరి స్వామి, బుర్రి అంజయ్య ముదిరాజ్, బుర్రి మహేందర్ ముదిరాజ్, వడ్డెర సంఘం నాయకులు గొలుసుల ఎల్లయ్య, గొలుసుల దుర్గాచలం, నిడిగొండ వెంకటయ్య, గోపగాని అంజయ్య గౌడ్, కొంతం శ్యామ్ గౌడ్, తుపాకుల శ్యాంసుందర్, అంబాల సంపత్ గౌడ్, అంబాల రఘునాథ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.