Farmer | ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు రాజు ఎన్నడికి కాడు.. రైతుల ఆవేదన వీడియో
Farmer | కాంగ్రెస్ సర్కార్ హయాంలో కొనుగోలు కేంద్రాలవైపు అధికార యంత్రాంగం చూసింది లేదంటూ తమను పట్టించుకున్నది లేదంటూ రైతులు వాపోతున్నారు.
Farmer | కాంగ్రెస్ సర్కార్ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కొనుగోలు కేంద్రాలవైపు అధికార యంత్రాంగం చూసింది లేదంటూ తమను పట్టించుకున్నది లేదంటూ వాపోతున్నారు.
ఓ రైతు మాట్లాడుతూ..నా పేరు మేరుగు చంద్రమౌళి.. పల్లగుట్ట.. నాకు నాలుగు ఎకరాలుంది. కాంగ్రెస్ సర్కార్ రైతులను పట్టించుకోవడం లేదు.. రైతు బీమా మొత్తమే పోయింది. రైతులకు అసలు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తలేడు. ఆఖరికి ఎరువుల కొరత కూడా ఏర్పడింది. పండించిన ధాన్యాన్ని గిట్టుబాటు ధర మార్కెట్‌కు తీసుకుపోయి అమ్ముకోవడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఏర్పడ్డాయి. వడ్లు 40 కిలోల బ్యాగ్‌కు 2 కిలోల కటింగ్ అంటున్నడు. తాలు పట్టాలే.. మ్యాచర్ రావాలే.. అన్నీ వచ్చినా కూడా 40 కిలోల బ్యాగ్‌కు 2 కిలోల కటింగ్ అంటున్నరు.
రైతులకు ఎలాంటి అనుకూలంగా ఈ ప్రభుత్వం వ్యవహరించడం లేదు. ఈ మార్పు వల్ల కేసీఆర్ కన్న మంచిగా చేస్తుండొచ్చు. ఆ ప్రభుత్వం ఎట్లుంటదో చూద్దామని ఆలోచనలో గెలిపించారు తప్ప.. ఇంతకన్నా మెరుగైన పనులు చేస్తడని ఆలోచించారే తప్ప.. మా ఆలోచన అమలు కాలే.. నష్టపోయినం. రైతు రాజు ఎక్కడిది కనీసం పండించిన పంటకు బోనస్ కూడా లేదంటూ వాపోయాడు.
మరో రైతు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి దిగజారిపోయిందని మండిపడ్డారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు రాజు ఎన్నడికి కాడు. కాంగ్రెస్ వాళ్లు వచ్చి ఓటు అడిగితే మీకు ఓటు వేయనని మొహం మీదనే చెప్తానన్నారు.రెండు నెలల నుంచి కొనుడు లేదు.. అమ్ముడు లేదు. బస్తాలు కొనుక్కొచ్చేది మేమే.. కాంటాలు పెట్టేది మేమే. లారీలు తెచ్చుడు.. కిరాయిలు కూడా మాకే అంటూ చెప్పుకొచ్చాడు.
పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చింది
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అనుకూలంగా వ్యవహరించడం లేదు
కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి నష్టపోయాము https://t.co/T3QGUpdoHj pic.twitter.com/2iq5SmOtr5
— Telugu Scribe (@TeluguScribe) May 20, 2026
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి దిగజారిపోయింది
ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు రాజు ఎన్నడికి కాడు
కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఓటు అడిగితే మీకు ఓటు వేయనని మొహం మీదనే చెప్తాను https://t.co/nnkPT6aXQJ pic.twitter.com/C2LILkITr9
— Telugu Scribe (@TeluguScribe) May 20, 2026
Read Also :
Chattogram | బంగ్లాదేశ్‌లో భారతీయ దౌత్యవేత్త అనుమానాస్పద మృతి.. గుండె పోటే కారణమా..?
US Tragedy | అమెరికాలో బాపట్ల టెక్కీ మృతి.. తల్లిదండ్రులు, తమ్ముడికి తీవ్ర గాయాలు
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
Blue Drum Murder | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితులు ముస్కాన్, సాహిల్‌కు మరణశిక్ష
Mythri Movie Makers | నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. దసరా బరిలో కీలక సినిమాల పంపిణీ బాధ్యతలు ఆ సంస్థకే!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

