హనుమకొండ, జూన్ 03 : ఉద్యమ నాయకుడు, నిఖార్సైన గులాబీ సైనికుడు సిద్దిపేట ఎమ్మెల్యే హారీశ్ రావు అని మాజీ చైర్మన్లు నాగుర్ల వెంకటేశ్వర్లు, మర్రి యాదవరెడ్డి అన్నారు. హరీశ్ రావు జన్మనదినాన్ని పురస్కరించుకొని జిల్లా పార్టీ అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ ఆదేశాల మేరకు మంగళవారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గులాబీ శ్రేణులు నిర్వహించిన వేడుకులకు వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్కు వెన్నుదన్నుగా నిలుస్తున్న గొప్ప నాయకుడు హరీశ్ రావుని కొనియాడారు.
బీఆర్ఎస్ పార్టీ వెన్నెముకగా కష్ట కాలంలో నిలుస్తూ ప్రజల తరఫున పోరాడుతున్న యోధుడు హరీశ్ రావు అన్నారు. పదేండ్ల ఏండ్ల బీఆర్ఎస్ పాలనలో నీటి పారుదల, ఆర్థిక శాఖ మంత్రిగా ఆయన రాష్ట్రానికి ఎనలేని సేవలు చేశారన్నారు. చరిత్రలో నిలిచిపోయే కాళేశ్వరం ప్రాజెక్టు సాకారంలో కేసీఆర్తో పాటు హరీశ్ రావు శ్రమ, కృషి మరువ లేనిదని పేర్కొన్నారు.
హరీశ్ రావు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. అనంతరం గులాబీ శ్రేణులు మిఠాయిలు పంచుకొని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్ర మంలో వరంగల్ పశ్చిమ నియోజక వర్గం కో ఆర్డినేటర్ పులి రజినీకాంత్, మాజీ కార్పొరేటర్ జోరిక రమేష్, నయీమొద్దీన్, సల్వాజి రవీందర్ రావు, బుద్దె వెంకన్న, దూలం వెంకన్న, డివిజన్ అధ్యక్షులు, నాయకులు సంపతి రఘు, విద్యార్థి నాయకులు పబ్బోజు శ్రీ కాంత్ చారి, బైరపాక ప్రశాంత్, వీర స్వామి తదితరులు పాల్గొన్నారు.