జనగామ : రైతులు లాభసాటి వ్యవసాయం చేసేందుకు నూతన పంటలు పండించాలని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సహకార నూనె గింజల ఉత్పత్తి దారుల సమాఖ్య లిమిటెడ్ సమక్షంలో రైతులకు ఆయిల్ ఫామ్ మొక్కలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మాట్లాడుతూ..ఆయిల్ ఫామ్ సాగుతో రైతులకు అధిక లాభాలు వస్తాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ ఫామ్ సాగుకు అనేక రాయితీలు కల్పిస్తుందన్నారు. రైతులందరూ సమిష్టిగా ఆయిల్ ఫామ్ సాగుకు శ్రీకారం చుట్టి లాభాలు గడించాలన్నారు.
కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, ఆయిల్ ఫిట్ కార్పొరేషన్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు ఇరి రమణారెడ్డి, తదితరులు ఉన్నారు.